Panchatantram Movie : ఇటీవల ఓటీటీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే.థియేటర్‌లో రిలీజైన సినిమాలతో పాటు డైరెక్ట్ ఓటీటీ సినిమాలు కూడా ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఇటీవల బ్రహ్మానందం నటించిన పంచతంత్రం సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. కోలీవుడ్ నటుడు సముద్రఖని, ముద్దగుమ్మ కలర్స్ స్వాతి , బ్యూటిఫుల్ శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, మత్తు వదలరా ఫేమ్ నరేష్ అగస్త్య, శ్రీ విద్య ప్రధాన పాత్రలుగా నటించిన అంథాలజీ పంచతంత్రంకి హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్ 9న థియేటర్స్‌లో విడుదల చేశారు.
ఈ మూవీలోని కాన్సెప్ట్స్, నటీనటుల ప్రతిభ, టెక్నీషియన్స్ టేకింగ్‌కి విమర్శకుల ప్రశంసలు అందాయి. మన శరీరంలోని పంచేద్రియాలను జ్ఞాపకాలతో అనుసంధానిస్తూ జీవితాన్ని చూడాలనే పాయింట్‌తో ఈ అంథాలజీని చక్కగా తెరకెక్కించారని, అలాగే ఐదు కథల హృదయ స్పందనగా ‘పంచతంత్రం’ను రూపొందించారని విమర్శకులు ఎంతో అభినందించారు. అయితే థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసే అవకాశం దక్కనుంది. సాధారణంగా ఓటీటీలు అంటే అమెజాన్ ప్రైమ్, తెలుగు ఓటీటీ ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, నెట్ ఫ్లిక్స్ ఇవే మనకు గుర్తుకు వస్తాయి. ఈ పంచతంత్రం సినిమా మాత్రం ఇందులో అందుబాటులో ఉండదు.
పంచతంత్రం అంథాలజీ సిరీస్ ను ఈటీవీ విన్ లో మాత్రమే అందుబాటులోకి రానుంది. తెలుగు నుంచి వచ్చిన ఇదొక కొత్త ప్లాట్ ఫామ్ కాగా, దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కారణం ఇందులో కొత్త సినిమాలు విడుదల కాకపోవడమే. అందుకే కాలానుగుణంగా మారి ఇప్పుడు పంచతంత్రం సినిమాను కొనుగోలు చేసి డిజిటల్ ప్రీమియర్ చేయబోతున్నారు. . మార్చి 22 నుంచి ఈటీవీ విన్ లో పంచతంత్రం సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రేమ, భయం, చావు, నమ్మకం, లక్ష్యాలను సాధించడం అనే వేర్వేరు ఐదు కథల సముహారంగా పంచతంత్ర అంథాలజీ సినిమా రూపొందింది. ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…