మరి కొద్ది రోజులలో భారత్ వేదికగా వరల్డ్ కప్ సమరం మొదలు కానున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఆరంభం కానుంది. మెగా టోర్నీకి సన్నాహకంగా వార్మప్ మ్యాచ్ లు సెప్టెంబర్ 29 నుంచి ఆరంభం అయిన విషయం తెలిసిందే. మొత్తం 10 జట్లు కూడా రెండేసి వార్మప్ మ్యాచ్ లను ఆడనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ మొదలైంది. ఇందులో టాస్ నెగ్గిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ముందు జాగ్రత్తగా అతడు వార్మప్ మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడు. దాంతో టామ్ లాథమ్ కెప్టెన్ గా ఉన్నాడు.
అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇండియాకి వచ్చిన పాకిస్తాన్‌కి అదిరిపోయే ఆతిథ్యం లభించింది. కెప్టెన్ బాబార్ అజామ్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన టీమ్ దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. ప్రస్తుతం పాక్ ప్లేయర్స్ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బస చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి పటిష్ట భద్రత నడుమ ప్లేయర్స్‌ను పార్క్ హయత్ హోటల్‌కి తీసుకెళ్లారు. ఇక హైదరాబాద్ చేరుకున్న పాక్ ప్లేయర్స్‌కి అదిరిపోయే ఫుడ్‌ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పాక్ ప్లేయర్స్‌కి హైదరాబాద్ బిర్యానీతో పాటు మటన్ కర్రీతో స్పెషల్ మెనూను ఏర్పాటు చేశారు.
ఇక వీటితో పాటు గ్రిల్డ్ ల్యాంబ్ చాప్స్, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ వంటివి మెనులో భాగంగా వారి కోసం ఏర్పాటు చేశారు. ఇక పాకిస్తాన్ ప్లేయర్స్ కోసం ప్రత్యేకంగా ఉడికించిన బాస్మతి రైస్, బోలోగ్నీస్ సాస్‌తో కూడిన స్పాగెట్టి, వెజ్ పులావ్ వంటి వాటిని పాక్ ప్లేయర్స్ మెనూలో చేర్చారు.ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో తమకు లభించిన ఘన స్వాగతం పట్ల పాకిస్తాన్ క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఇంత వరకు ఎంత గొప్ప సాదర స్వాగతం ఎప్పుడు లభించలేదు’ అనే అర్థం వచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశాడు. పాక్ క్రికెటర్లు హైదరాబాద్ విమానశ్రయం నుంచి పార్క్ హయత్ హోటల్‌కు వెళ్లిన వీడియో తెగ వైరలయ్యింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…