Mainampalli Hanumantha Rao : తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందిస్తుంది. అయితే ముఖ్యమైన నాయకులని కూడా కాంగ్రెస్ తన పార్టీలోకి ఆహ్వానిస్తుంది. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకిలోకి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సీనియర్ నేత, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మారారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్‌తో కలిసి సెప్టెంబర్ 28 గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఎ రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఈరోజు పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదని ఆరోపిస్తూ హనుమంతరావు ఇటీవల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రాజీనామా లేఖను అందించిన విషయం తెలిసిందే. అధికార దాహంతో ఉన్న కొంతమంది వ్యక్తుల చేతుల్లో బీఆర్‌ఎస్ కీలుబొమ్మగా మారిందని హనుమంతరావు ఆరోపించిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడానికి అగ్ర నాయకత్వం నిరాకరించడంతో ఆయన బీఆర్‌ఎస్ నుంచి వైదొలిగినట్లు సమాచారం.
2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి.. మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలోనూ ఆయన పేరు ఉంది. అదే సమయంలో ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావుతో నెలకొన్న విభేదాల కారణంగా బీఆర్ఎస్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందాయనకు. కొద్దిరోజుల కిందటే బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. తాజాగా కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకుని రావడం, హరీష్ రావును మట్టికరిపించడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారాయన.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…