OTT : ప్రతి వారం థియేటర్, ఓటీటీ ప్రేక్షకులకి కావలసినంత వినోదం దక్కుతుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ప్రేక్షకులు ఫుల్ థ్రిల్ అవుతున్నారు. అయితే థియేటర్ సినిమాల కన్నా కూడా కొందరు సినీ లవర్స్ ఓటీటీ కంటెంట్ పైనే ఎక్కవ దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ అండ్ ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి.
నాని నటించిన మాస్ చిత్రం దసరా ఈ నెల 27 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం థియేటర్‌లో మంచి హిట్ కొట్టగా, ఇప్పుడు ఓటీటీలో కూడా పలు రికార్డులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక పత్తు తల (తమిళ చిత్రం) ఏప్రిల్ 27 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతుంది. ప్రియాంక చోప్రా నటించిన ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ ఏప్రిల్ 28 నుండి ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఇది సమంత ప్రధాన పాత్రలో ఇండియాలో రూపొందనున్నట్టు తెలుస్తుంది. ఇక మలయాళ భాషా చిత్రం తురముఖం నివిన్ పౌలీ మరియు నిమిషా షాజయన్ ప్రధాన పాత్రలలో రూపొందింది. సమాజం హింస మధ్యపానంతో ఎలా నాశనం అవుతుందనేది ఈ చిత్రంలో చూపించారు. ఈ నెల 28 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది.
ఇక థియేటర్ విషయానికి వస్తే.. అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఈ సినిమా ఏప్రిల్ 28న థియేటర్‌లలో విడుదల కాబోతుంది. సినిమా పై బాగానే బజ్ ఉంది.మరోవైపు మణిరత్నం కలల చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్2’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా విషయంలో మణిరత్నం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.