Saira And Acharya : మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు మీద ఎన్ని రికార్డులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన చిరు ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. అయితే స్ట్రైట్‌గా చేసిన చిత్రాలు మంచి విజయం సాధించకపోవడంతో చిరు కొంత రీమేక్‌లపై దృష్టి సారిస్తున్నాడు. ఖైదీ నెం 150 చిత్రం వంటి సూపర్ హిట్ చేసిన చిరు తర్వాత చేసిన సైరా, ఆచార్యతో ప్రేక్షకులని ఎంతగానో నిరాశపరిచాడు. ఇటీవల వాల్తేరు వీరయ్య చిత్రంతో మంచి హిట్ కొట్టిన కూడా ఆ రెండు సినిమాలు చిరుపై పెద్ద ఎఫెక్టే చూపిస్తున్నాయి.
అయితే గత అనుభవాల దృష్ట్యా సూపర్ స్టార్ డైరెక్టర్లతో పాటు సీనియర్ ఫిల్మ్ మేకర్స్‌తో కూడా పని చేయడం చిరంజీవికి ఇష్టం లేని విధంగా అనిపిస్తుంది.ది. వశిష్ట, పి.ఎస్. మిత్రన్, కళ్యాణ్ కృష్ణ కురసాల వంటి వారు దర్శకత్వం వహించేందుకు రెడీగా ఉన్నా పూరి జగన్ మరియు వివి వినాయక్ వంటి సీనియర్లు కొంత కాలంగా చిరుతో సినిమా తెరకెక్కించేందుకు రెడీగా ఉన్నా ఆయన వారికి అవకాశం ఇవ్వడం లేదు. సీనియర్ దర్శకులు తన ఇన్‌పుట్‌ను కూడా తీసుకోకుండా గుడ్డిగా సెట్స్‌కు వెళ్తున్నారని మెగాస్టార్ భావించడం వల్ల వారితో సినిమాలు చేయడం లేదని ఇన్‌సైడ్ టాక్.
తన ఇన్‌పుట్ తీసుకుంటే సినిమా పెద్ద హిట్ అవుతుందని చిరు భావిస్తున్నారు. కెఎస్ బాబీ దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఎంత మంచి విజయం సాధించిందో మనం చూశాం. ఇందులో చిరు ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉంది. అయితే రానున్న రోజులలో చిరు యువ దర్శకులతోనే సినిమాలు చేస్తారని టాక్. కాగా, ప్రస్తుతం చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాలం’ సినిమాకు రీమేక్. ఈ సినిమా ఈ యేడాది విజయ దశమి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.