Omkar : ఓంకార్ అన్నయ్య అంటే ప్రతి ఒక్క తెలుగ ప్రేక్షకుడు ఇట్టే గుర్తు పడుతుంటారు. . ‘ఆట’ ఏదైనా సరే.. దాంట్లో ఎమోషన్స్ జోడించి షోని రక్తికట్టించడంలో ఓంకార్ దిట్ట అనే చెప్పాలి. ఆదిత్య మ్యూజిక్‌లో ‘అంకితం’, జీలో ఆట, మాలో ఛాలెంజ్, ఆ తరువాత వివిధ ఛానల్స్‌లో ఇస్మార్ట్ జోడీ, మాయా ద్వీపం, డాన్స్ ప్లస్, డాన్స్ ఐకాన్ అనే షోలతో బుల్లితెరపై ఓంకార్ తన మార్క్ చూపించారు. ప్రస్తుతం ఓంకార్ హోస్ట్ చేస్తున్న ‘సిక్స్త్ సెన్స్’ అనే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ షో రసవత్తరంగా సాగుతుంది. వారం వారం మంచి మంచి గెస్ట్‌లతో వినోదంతో పాటు ఎమోషన్స్‌ని పండిస్తున్న ఓంకార్ అన్నయ్య.. ప్రతి వారం అలరిస్తూనే ఉంటాడు.
తాజాఎపిసొడ్‌లో రసవత్తరమైన సన్నివేశం చోటు చేసుకుంది. తన తండ్రి చనిపోమయాక ఇద్దరు తమ్ముళ్లకి అన్నీ తానై కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు ఓంకార్. పెద్ద తమ్ముడు అశ్విన్‌ని హీరోని చేయాలని.. చిన్న తమ్ముడు కళ్యాణ్‌ని ప్రొడ్యుసర్‌ని చేయాలనేది ఓంకార్ కోరిక ఎంతగానో ఉంటుంది. అన్నట్టుగానే అశ్విన్‌తో జీనియస్, రాజుగారి గది 3 సినిమాలు చేసి హీరోగా గుర్తింపు ఇచ్చారు ఓంకార్. ఇక చిన్న తమ్ముడు నిర్మాణరంగంలోనే అన్న ఓంకార్‌కి తోడుగా ఉంటూ వస్తున్నారు. తమ్ముళ్లంటే ఓంకార్ అన్నయ్యకి పంచ ప్రాణాలు.. తండ్రి చనిపోయిన తరువాత వాళ్లకి మంచి లైఫ్ ఇచ్చే వరకూ తెల్లబట్టల్లోనే కనిపించిన ఓంకార్ చాల కష్టపడ్డాడు.
తమ్ముడు అశ్విన్‌ని ఎదురుగా నిలబెట్టి.. ‘నీ లైఫ్‌లో బాధని నాకు చెప్పుకోకుండా దాచిపెట్టావా? అని అడిగారు ఓంకార్. ఆ మాటతో అశ్విన్ కళ్లు చెమ్మగిల్లాయి. నా స్ట్రగుల్స్ నీతో చెప్పుకోలేదు అన్నయ్యా అనేశాడు. ‘అలా దాచిపెట్టిన ఒక్క స్ట్రగుల్ చెప్పు’ అని అడిగారు ఓంకార్. ఆ మాటతో అశ్విన్ కన్నీళ్లు ఆగలేదు.. ఏడ్చేశాడు. అది చూసిన ఓంకార్.. ‘నాన్నైనా.. అన్నైనా.. అన్నింటికీ నేనే నీకు.. అలాంటి నాకు చెప్పడానికి ఏంట్రా’ అని ఓంకార్ అడగడం.. నిజంగానే కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది. అలా ఓంకార్ తన మాటలతో పాటు ఆటతో ఎంతగానో అలరించాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…