YS Sharmila : కాంగ్రెస్ పాత కాపులు ష‌ర్మిల వెంట‌.. ఏపీలో ఇంట్రెస్టింగ్‌గా మారిన రాజ‌కీయం

YS Sharmila : రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తరువాత నామ రూపాలు లేకుండా పోయింది.1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో అధికార పక్షమో, ప్రతిపక్షంగానో ఉంటూ వచ్చిన పార్టీ 2014 నాటికి అసెంబ్లీలో క‌నిపించ‌కుండా పోయింది. ఒక్క సీటు ద‌క్క‌లేదు. అంతేకాదు 2014, 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇలాంటి స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తుంది. పార్టీని నిర్మాణ ప‌రంగా ముందుకు తీసుకెళ్లే క్ర‌మంలో ఒక మహిళ చేతికి కాంగ్రెస్ నాయకత్వం ప‌ద‌వి ఇచ్చింది. వైఎస్ షర్మిలకి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు అందించింది.

ఉమ్మడి ఏపీకి పీసీసీ ప్రెసిడెంట్ గా రెండు సార్లు పనిచేసిన వైఎస్సార్ తనయగా షర్మిల అదే హోదాలో పార్టీ పగ్గాలు అందుకోవడం ఒక విశేషంగా చెప్పాలి. ఇక ఏపీ అధ్య‌క్షురాలిగా ప‌దవీ బాధ్య‌త‌లు అందుకున్న త‌ర్వాత ష‌ర్మిళ చుట్టూ పాత కాపులు క్యూ క‌డుతున్నారు. ఇటీవ‌ల షర్మిలతో కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి యాదవ్ షర్మిళ‌తో భేటి అయ్యారు. ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో షర్మిల భర్త బ్రదర్ అనీల్ భేటీ అయిన విషయం తెలిసిందే. సీనియర్లలో మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి కొందరు షర్మిలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జేడీ శీలం, పళ్ళంరాజు లాంటి చాలామంది షర్మిలకు మద్దతుగా నిలబడ్డారు. కాంగ్రెస్ లో వైఎస్సార్ కి అండగా నిలిచిన వారు ఆయన నేస్తం కేవీపీ రామచంద్రరావు. ఆయన వైఎస్సార్ ని వెన్నంటి ఉండేవారు. వైఎస్సార్ ది గ్లామర్ అయితే కేవీపీది గ్రామర్ అని చెప్పుకునే వారు. ఇప్పుడు ఆయ‌న ష‌ర్మిళ వెంట ఉండ‌డం వివేషం.

old kapus are joining with YS Sharmila
YS Sharmila

వైఎస్‌కు ఒకప్పుడు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళలో చాలామంది షర్మిల చుట్టూ చేరుతున్నట్లు అర్థ‌మవుతోంది. 2009 తర్వాత పార్టీలో నుండి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసినప్పుడు పైన చెప్పుకున్న సీనియర్లు ఎవరూ మద్దతుగా బయటకు రాలేదు. కాని ఇప్పుడు ష‌ర్మిళ అధ్య‌క్షురాలిగా నియ‌మించ‌బ‌డ్డ త‌ర్వాత బ‌య‌ట‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.కేవీపీ ఇటీవల షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకలో ఆయన వేదికపై కనిపించారు. ఇక‌ షర్మిల వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లే సమయంలో ఆమె వెంట ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పక్కనే ఉండే కేవీపీని ఆయన నీడగా అంతా చెప్పుకునే వారు. అంతే కాదు ఆయన వైఎస్సార్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ముఖ్య సలహాదారుగా కూడా పనిచేశారు. మొత్తానికి చూస్తే కనుక ఏపీలో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయాలనే లక్ష్యంతో ఉన్న వైఎస్‌ షర్మిలకు కేవీపీ అనే కొండంత అండ దొరికినట్లు కనిపిస్తోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago