Okaya Freedom LI 2 : ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై ఏకంగా రూ.17వేలు త‌గ్గింపు..!

Okaya Freedom LI 2 : భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల‌ అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజలు తమ రోజువారీ పనులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్స్‌పై కూడా బంప‌ర్ ఆఫ‌ర్స్ ఉంటున్నాయి. త‌గ్గింపు ద‌ర‌ల‌కి అందుబాటులో ఉండ‌డంతో పాటు వాటిపై ఈఎంఐ ఆఫ‌ర్స్ కూడా ఇస్తున్నారు. తాజాగా ఫ్లిప్ కార్ట్‌లో అదిరిపోయే ఆఫ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 17 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఒకాయ ఫ్రీడమ్ ఎల్ఐ 2 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆఫ‌ర్ ఉండ‌గా,. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర పోర్టబుల్ చార్జర్‌తో కలుపుకొని రూ. 75,899గా ఉంది.

అయితే మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను క్రెడిట్ కార్డు ద్వారా కొంటే మాత్రం ఏకంగా రూ. 16.750 వరకు సేవ్ చేసుకోవ‌చ్చు .హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఇది కొన్న‌ప్పుడు మీకు ఆ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. అంటే మొత్తంగా ఈ స్కూట‌ర్ ఆఫ‌ర్ కింద రూ. 58 వేలకే వ‌స్తుంది. ఇక ఈ ఇస్కూటర్‌పై 3 ఏళ్ల వారంటీ వస్తుంది. బ్యాటరీ, మోటార్, కంట్రోలర్, చార్జర్, కన్వర్టర్, రిమ్స్, సస్పెన్షన్ వంటి వాటికి ఈ వారంటీ ఉంటుంది. ఈ స్కూట‌ర్ ఫీచ‌ర్స్ గ‌మ‌నిస్తే మ‌నం దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వ‌ర‌కు న‌డ‌పొచ్చు. చార్జింగ్ స‌మ‌యం 5 గంట‌లు పడుతుంది. టాప్ స్పీడ్ వ‌చ్చేసి గంట‌కి 25 కిలో మీట‌ర్లు.

Okaya Freedom LI 2 electric scooter gets discount
Okaya Freedom LI 2

ఇందులో ట్యూబ్ లెస్ టైర్స్ ఉంటాయి. బ్యాటరీ ఇండికేటర్, స్పీడో మీటర్, ట్యాకో మీటర్, ట్రిప్ మీటర్ వంటివి ఉంటాయి. రిమోట్ స్టార్ట్ స్టాప్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. యాంటీ థెఫ్ట్ అలారం, మోటార్ లాక్ ఫీచర్లతో పాటు ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ఉంటుంది. టెలీస్కోపిక్ సస్పెన్షన్ అమర్చారు. ఎల్ఈడీ హెడ్‌లైట్స్ విత్ డీఆర్ఎల్ ఉంటాయి. దీనిని ఈఎంఐలో కొనాల‌ని అనుకుంటే ముందుగా రూ.35 వేలు డౌన్ పేమెంట్ చేసి నెలవారీ ఈఎంఐ రూ. 1662 నుంచి తీసుకోవ‌చ్చు. జీరో డౌన్ పేమెంట్ అయితే నెలకు రూ. 3600 కట్టాలి. 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 4700 చెల్లించుకోవాలి. 25 వేల డౌన్ పేమెంట్‌తో అయితే 18 నెలల టెన్యూర్‌కు నెలకు రూ. 2700 కట్టాల్సి ఉంటుంది. అదే ఏడాది పాటు టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 6,200 పడుతుంది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం త‌క్కువ ధ‌ర‌కి వ‌స్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూట‌ర్ ని కొనే ప్లాన్ చేయండి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago