Nutan Prasad : నూతన్ ప్రసాద్..ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన నూతన్ ప్రసాద్ తన నటనతో అనేక అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఈయనకు 1984లో నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పురస్కారం కూడా లభించింది. నూతన ప్రసాద్ 365వ సినిమా బామ్మ మాట బంగారు బాట షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడి అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు.
నూతన్ ప్రసాద్ చెప్పే కొన్ని డైలాగ్స్ ఎంత పాపులారిటీ పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, నూటొక్క జిల్లాల అందగాడిని అనే డైలాగులు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. నూతన ప్రసాద్ ఒక సీరియల్ లో కూడా నటించారు. ఆయన 2011 మార్చి 30వ తేదీన హైదరాబాద్ లో అనారోగ్యంతో మృతి చెందారు.నూతన్ ప్రసాద్ దాదాపు 30 సంవత్సరాల వరకు సినిమాల్లో నటించి ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు.
![Nutan Prasad : ఆ ఒక్క సంఘటనతో నూతన్ ప్రసాద్ జీవితం మొత్తం మారిపోయింది.. అసలా రోజు ఏం జరిగిందంటే..? Nutan Prasad car accident incident what really happened](http://3.0.182.119/wp-content/uploads/2022/10/nutan-prasad.jpg)
1989 సంవత్సరంలో రాజేంద్రప్రసాద్ హీరోగా బామ్మ మాట బంగారు బాట అనే సినిమా షూటింగ్ సమయంలో ఓ ప్రమాదం జరగ్గా ఆ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. షూటింగ్ కారును జేసీబీతో పైకెత్తగా ఆ సమయంలో కారు చైన్ తెగి కింద పడింది. ఈ ప్రమాదంలో నూతన్ ప్రసాద్ వెన్నుముక విరిగిపోయింది. జీవితంలో ఆగిపోకూడదు అనే విషయాన్ని తెలుసుకున్న నూతన్ ప్రసాద్ గాయపడ్డప్పటికీ నటన ఆపలేదు. తన జీవితం ఎంతో మందికి ఆదర్శం. నేరాలు ఘోరాలు టీవీ షోకి వాయిస్ ఓవర్ అందించడంతో చాలా పాపులారిటీ తెచ్చుకున్నారు.