Gurivinda Seeds : గురివింద గింజలు… ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి. ఇవి తీగ జాతికి చెందినవి. ఈ గురివింద తీగలు కంచెలకు పాకి ఉంటాయి. ఈ తీగలకు గుత్తుగుత్తులుగా పైన ఎరుపు కింద నలుపు రంగులో గింజలు అంటాయి. ఇవి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ గింజలను పూర్వకాలంలో తూకానికి ప్రమాణంగా ఉపయోగించే వారు. వివిధ అనారోగ్య సమస్యలను నయం చేయడంలోనూ ఈ గురివింద గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. గురివింద తీగ ఆకులు కూడా ఔషధ గుణానలు కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించి ఏయే వ్యాధులను నయం చేసుకోవచ్చో, ఈ గింజలను ఏ విధంగా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బట్టతలపై జుట్టు వచ్చేలా చేయడంలో గురివింద గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. తలపై జుట్టు మొత్తం ఊడిపోయిను వారు ఆలస్యం చేయకుండా గురివింద తీగ ఆకులను మెత్తగా నూరి వాటిని బట్టతలపై రాస్తూ ఉంటే కొంతకాలం తరువాత బట్టతలపై వెంట్రుకలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చెవి తమ్మెలకు పుండ్లు అయినప్పుడు గురివింద గింజల పొడిని గేదె పాలలో వేసి కలిపి తోడు పెట్టాలి. దీనిని చిలికి వెన్న తీసి నిల్వ చేసుకోవాలి. ఈ వెన్నను రాస్తూ ఉండడం వల్ల చెవి తమ్మెలకు అయిన పుండ్లు తగ్గుతాయి. సర్ఫి పుండ్లను తగ్గించే శక్తి కూడా గురివింద గింజలకు ఉంటుంది. గురివింద తీగ ఆకులను నీటితో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని సర్ఫి పుండ్లపై లేపనంగా రాస్తూ ఉంటే సర్ఫి పుండ్లు తగ్గుతాయి.
![Gurivinda Seeds : గురివింద గింజలతో ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..! Gurivinda Seeds has many wonderful benefits must take](http://3.0.182.119/wp-content/uploads/2022/10/gurivinda-seeds.jpg)
100 గ్రా.ల గురివింద గింజలను రెండు రోజులు నీటిలో నానబెట్టి దంచి రసాన్ని తీయాలి. దీనికి 100 గ్రా. గుంటగలగరాకు రసాన్ని, నువ్వుల నూనెను కలిపి చిన్న మంటపై కేవలం నూనె మిగిలే వరకు మరిగించి వడకట్టి నిల్వ చేసుకోవాలి. దీనిని చర్మం పై లేపనంగా రాస్తూ ఉంటే గజ్జి, తామర, కుష్టు, చిడుము వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. గురివింద గింజలను కుంకుడుకాయ రసంతో అరగదీసి కణతలకు రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. గురివింద తీగ ఆకులకు ఆముదాన్ని కలిపి వేయించి దానిని వాపులు, నొప్పులపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. గురివింద గింజలను తేనెతో కలిపి మెత్తగా నూరి దానిని పేనుకొరుకుడుపై రాసి రుద్దుతూ ఉండడం వల్ల పేనుకొరుకుడు తగ్గి అక్కడ మరలా వెంట్రుకలు వస్తాయి.
గురి వింద గింజలను, కంద దుంపతో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొలలపై రాస్తూ ఉండడం వల్ల మొలల వ్యాధి తగ్గుతుంది. ఎర్ర గురివింద గింజలను నీటిలో నానబెట్టి వాటిని 500 ఎంఎల్ నీటిలో వేసి నీరు 125 ఎంఎల్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. దీనిలో 40 గ్రా. నువ్వుల నూనెను కలిపి మళ్లీ చిన్న మంటపై ఉంచి కేవలం నూనె మిగిలే వరకు మరిగించి నిల్వ చేసుకోవాలి. దీనిని స్నానానికి గంట ముందు వాత నొప్పులపై రాస్తూ మర్దనా చేయడం వల్ల వాత నొప్పులు తగ్గుతాయి. ఇవే కాకుండా గురి వింద గింజలను ఉపయోగించి తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవచ్చు. అలాగే లింగ బలహీనతను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా గురివింద గింజలను ఉపయోగించి మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.