NTR 30 : ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో మొదలు కావల్సిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రీసెంట్‌గా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైంది. చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సందడి చేయబోతోంది. ఇక ఈసినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు.. ఫస్ట్ షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించబోతున్నట్టు , దాని కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తారక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆయన కెరీర్ లోనే ఎప్పుడూ చూడని విధంగా కొరటాల ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. పోరాట సన్నివేశాలలో.. రక్తం ఏరులై పారబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సెట్స్ నుంచి రిలీజ్ అయిన బ్లడ్ ట్యాంకర్ ఫోటోతో .. ఈసినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతుంది. ఎన్టీఆర్30 సెట్స్ నుంచి లీక్ అయిన ఈ ఫోటోలో.. ట్యాంకర్ నిండా నీరు కాకుండా నకిలీ రక్తంతో నిండి ఉంది. ఎన్టీఆర్ 30 ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం ఈ డూప్ బ్లడ్ వాడబోతున్నట్టు తెలుస్తోంది.
చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ని ఆది లాంటి ఊర మాస్ పాత్రలో చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తారక్ ఫ్యాన్స్ ఇక బ్లడ్ బాత్ గ్యారెంటీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ థర్టీ సినిమా ఇండస్ట్రీ చరిత్ర ను తిరగరాయబోతుంది అంటు ఫిక్స్ అయిపోయారు జనాలు. కచ్చితంగా ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుంది అంటూ ఇప్పటి నుండే జోస్యాలు చెబుతున్నారు ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ తో తారక్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. అది దృష్టిలో పెట్టుకుని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ తో విలన్ గా తలపడబోయేది బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. ఇక వీరిద్దరి మద్య పోరాట సన్నివేశాలు పీక్స్‌లో ఉంటాయని టాక్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…