Nikhil : స‌లార్ సినిమా చూశాక మైండ్ దొబ్బింది.. నిఖిల్ క్రేజీ రియాక్ష‌న్

Nikhil : గ‌త కొద్ది రోజులుగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ స‌లార్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, ప్రేక్షకుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన సలార్‌ థియేటర్లలోకి వచ్చేసింది. బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దుమ్మురేపుతోంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల కావడంతో తొలిరోజే సినిమాను చూసేయాలని థియేటర్లకు ఎగబడ్డారు. థియేటర్ల దగ్గర టపాసులు పేల్చి.. డ్యాన్సులు, డప్పు చప్పుళ్లతో హోరెత్తిస్తున్నారు. ప్రభాస్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం నార్మల్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. సెలబ్రెటీలు కూడా సలార్‌ సినిమాను తొలిరోజే చూసి థ్రిల్‌ అవుతున్నారు.

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు నిఖిల్‌, నవీన్‌ పోలిశెట్టి అయితే సినిమా చూసి రివ్యూలు కూడా పెట్టేశారు. బెనిఫిట్ షో చూశాక‌.. నిఖిల్ ట్వీట్ చేస్తూ.. ఇప్పుడే సలార్ మూవీ చూశా. ఇది మామూలు విజయం కాదు మాన్స్టర్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ భాయ్ ని ఎప్పుడు స్క్రీన్ పై చూసినా గూస్ బంప్స్ వస్తాయి. హోంబాలే సంస్థకు కంగ్రాట్స్. ప్రశాంత్ నీల్ మనకి విజువల్ వండర్ ని ఇచ్చారు. తప్పకుండా చూడండి అని నిఖిల్ ట్వీట్ చేశారు. అలాగే యువ హీరో నవీన్ పోలిశెట్టి కూడా సలార్ మూవీపై తన స్పందన తెలిపాడు. సలార్ చిత్రం థియేటర్స్ లో ఎంతో జోష్ నింపుతోంది. సెలెబ్రేషన్స్ మామూలుగా లేవు. చాలా రోజుల నుంచి ప్రభాస్ అన్నని ఇలా చూడాలని అంతా వెయిట్ చేస్తున్నారు. చెప్పాను కదా బాక్సాఫీస్ బద్దలైపోద్ది అని. సలార్ టీం కి కంగ్రాట్స్ ని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు.

Nikhil reaction after watching salaar movie
Nikhil

బెనిఫిట్ షో చూశాక థియేటర్ కి వచ్చిన శ్రీవిష్ణు అభిమానులతో కలిసి థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు. తాను ఒక హీరో అని మర్చిపోయి, ప్రభాస్ అభిమానిగా థియేటర్ లో విజిల్స్ వేస్తూ ఫ్యాన్స్ తో కలిసి హంగామా చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోని రెబల్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోని ఇతర సెలబ్రిటీస్, దర్శకులు కూడా సినిమా చూసేందుకు థియేటర్స్ కి వ‌చ్చి ర‌చ్చ చేశారు. ప్రభాస్ నుంచి చాలా కాలం తరువాత ఒక మాస్ బొమ్మ రావడంతో రెబల్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago