CM Revanth Reddy : తెలంగాణ నయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. అధికార, ప్రతిపక్ష నేతలపై వాడీవేడీగా చర్చ నడిచింది. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్లు చేశారు. విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉందని.. గజ్వేల్ రెండో స్థానంలో ఉండగా… హైదారాబాద్ సౌత్ మూడో స్థానంలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నుంచి ఎన్నికైన వాళ్లే గత తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించారన్నారు.
మరోవైపు.. బీఆర్ఎస్, ఎంఐఎం వేరు కాదని.. ఇద్దరు కలిసే పాలించారన్నారు. అయితే.. ఇదే అంశంపై స్పందించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.. విద్యుత్ కోతలపై రైతులు ధర్నాలు చేశారా అని ప్రశ్నించగా.. పేపర్ కటింగులతో రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే మల్లారెడ్డిపై కూడా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మల్లారెడ్డి తన మెడికల్ యూనివర్సిటీ కోసం అనేక భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే అనేక భూములు ఆయన పేరిట స్వాహాచేశారని, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో వందలాది ఎకరాలు ఆక్రమించుకుని ధరణి వచ్చిన తర్వాత దానిని చేర్చుకోగలిగారని విమర్శలు వినిపించాయ. అంతేకాకుండా అసైన్‌మెంట్ ల్యాండ్స్ కూడా ఆక్రమించుకుని పేదల కడుపు కొట్టారంటూ అప్పట్లో విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అక్రమాలు చేసిన వాళ్లని కూడా అస్సలు వదిలే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి ఇన్‌డైరెక్ట్‌గా మల్లారెడ్డిపై కామెంట్స్ చేసి వార్తలలో నిలిచారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా, మల్లారెడ్డి సాధారణ ఎమ్మెల్యేగా మారారు. తన తొలి బాణం రేవంత్ రెడ్డి మల్లారెడ్డిపైనే ఎక్కుపెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తన క్యారెక్టర్ ను కించపర్చే విధంగా అవమానపర్చేలా మాట్లాడిన మల్లారెడ్డిని వదిలిపెట్టబోనని కూడా రేవంత్ ఎన్నికలకు ముందే సన్నిహతుల వద్ద వ్యాఖ్యానించడంతో ఇప్పుడు మల్లారెడ్డికి అదే భయం పట్టుకుంది. లెక్కకు మించి ఉన్న ఇంజినీరింగ్, వైద్య కళాశాలలో ప్రభుత్వం ఏ తీరున విరుచుకపడి తనకు ఆర్ధికంగా నష్టం చేకూరుస్తుందోనన్న ఆందోళనలో మల్లారెడ్డి ఉన్నారు. మరి రేవంత్ నిజంగానే కక్ష సాధింపు చర్యలకు దిగుతారా? కామెడీ అని వదిలేస్తారా? అన్నది వేచి చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…