Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఇటీవల విడాకులు విషయంతో చర్చనీయాంశంగా మారింది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు దూకుడు ఎక్కడా తగ్గలేదు. అయితే కొద్ది సంవత్సరాల క్రితం చైతన్య జొన్నలగడ్డ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నిహారిక ఆయన నుండి విడిపోతున్నట్టు ప్రచరాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకున్నారట. అది మాత్రమే కాకుండా వారిద్దరి సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేసినట్టు సమాచారం. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు.
త్వరలోనే సరైన సమయం చూసుకొని సమంత మరియు నాగచైతన్యలు లాగా వీరిద్దరూ కూడా తమ విడాకుల గురించి అధికారికంగా ప్రకటిస్తారేమో అని అందరు అనుకుంటున్నారు. కొద్ది రోజులుగా నిహారిక విడాకులకి సంబంధించి ఎన్ని ప్రచారాలు జరుగుతున్నా కూడా ఈ వార్తలపై నిహారిక ఫ్యామిలీ కానీ అటు చైతన్య ఫ్యామిలీ కానీ ఇంతవరకు స్పందించడం లేదు.అలాగే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం గురించి స్పందించే నాగబాబు తన కూతురి విడాకుల విషయంపై అసలు స్పందించకపోవడంతో అందరిలో అనుమానాలు రెట్టింపు అవతున్నాయి. ఆయన ఈ ఆ వార్తలను ఖండిస్తూ ప్రకటన చేయలేదు.బహిరంగంగా ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు.
పెళ్లైన తర్వాత కూడా నిహారిక తన కెరియర్ మీద దృష్టి పెట్టింది. తాజాగా నిహారిక నటిస్తున్న డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ మే 19న విడుదల కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నిహారిక ఇంటర్వ్యూ లో ఆమె పర్సనల్ లైఫ్ విడాకుల గురించి ప్రశ్నించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్నకు సరైన సమాధానం వస్తుందని అందరు అనుకున్నారు. కాని తన విడాకుల గురించి అడిగిన ప్రశ్నకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఆ ప్రశ్నల్ని స్కిప్ చేసింది నిహారిక. దీంతో నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారేమో అందుకే నిహారిక స్పందించలేదు అని కొందరు అంటున్నారు. .విడాకులు తీసుకోకపోతే అదే విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేది కదా అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…