Niharika Konidela : మెగా డాటర్ నిహారిక ఇటీవల విడాకుల విషయంతో వార్తలలో నిలుస్తుంది. ఈ అమ్మడికి సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. నటిగా కన్నా నిర్మాతగా తన సత్తా చూపించాలని అనుకుంటుంది. కొద్ది రోజుల క్రితం ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిహారిక ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది మంచి సక్సెస్ అయింది. అలాగే, ఇటీవలే ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించింది.
అయితే కొన్నాళ్లు నటనకి దూరంగా ఉన్న నిహారిక బీబీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తమడా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్ ద్వారా నిహారిక మళ్లీ యాక్టింగ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘నాకు బెడ్‌పై రోషన్ కావాలి, మైండ్‌లో భార్గవ్ ఉన్నాడు’ అనే డైలాగ్ ఈ సిరీస్‌లో ఆమె కన్‌ఫ్యూజన్ స్టేట్‌కు అద్దం పడుతుంది. అయితే, ఇప్పుడు ఇదే డైలాగ్‌పై ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ‘ఇలా బెడ్‌పై ఒకరు, మనసులో ఇంకొకరు’ అనే డైలాగ్‌ను యంగ్ ఆడియన్స్ ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారనే విషయంపై కొంచెం అయిన దృష్టి పెట్టాలి కదా అని చురకలు అంటిస్తున్నారు.
ఈ మే 19న రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటోంది నిహారిక. మరి ఇది విజయం అందిస్తే నిహారిక మళ్లీ నటిగా బిజీ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక ఇదిలా ఉంటే పుష్ప-2 మూవీలో ఓ గిరిజన యువతి పాత్రలో కేమియో రోల్‌లో నటించేందుకు మెగా డాటర్ నిహారికను చిత్ర యూనిట్ సంప్రదించినట్లుగా తెలుస్తోంది. పుష్ప-2లో నటించే ఆఫర్ రావడంతో నిహారిక కూడా వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ వార్త కొద్ది రోజులుగా నెట్టింట వైరల్‌గా మారడంతో, నిజంగానే పుష్ప-2 మూవీలో నిహారిక నటిస్తుందా అనే చర్చ సాగుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…