Dil Raju : బ‌ల‌గం విష‌యంలో దిల్ రాజు చేసిన ప‌నికి చీవాట్లు పెడుతున్న నెటిజ‌న్స్

Dil Raju : ఎలాంటి హంగామా లేకుండా థియేట‌ర్‌లోకి వ‌చ్చి కేవ‌లం మౌత్ టాక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం బ‌ల‌గం. ఈ చిత్రం తెలంగాణలోని ప్రతీ పల్లెను కదిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను కురిపించింది. ఇక ఈ సినిమాని తెలంగాణలో ప్రతీ పల్లెలో పరదాలు కట్టి ప్రొజెక్టర్ల ద్వారా సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరు చూడాలనే లక్ష్యంతోనే నిర్మించాం. ఆ టార్గెట్ పూర్తవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని దిల్ రాజు సక్సెస్ మీట్‌లో పేర్కొన్నారు. మేము సినిమా ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నామని వస్తున్న విమర్శలు, ఆరోపణలు నిజం కాదు అని దిల్ రాజు అన్నారు.

మనుషుల మధ్య చెదిరిపోతున్న అనుబంధాలు, ఆప్యాయతలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ డైరెక్టర్ వేణు చేసిన బ‌ల‌గం చిత్రం ప్రస్తుతం ప్రతి ఊరిలో కూడా గ్రామ ప్రజలందరినీ ఒక్కటి చేస్తోంది. మొదట ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసిన దిల్ రాజు.. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. ఈ వేదికపై కూడా భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమాను.. ఊరూరా తెరలు కట్టి ప్రదర్శిస్తుండ‌డంతో దీనిపై దిల్ రాజు పోలీస్ కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. బలగం సినిమాను కాపీ చేసి ఊరూరా తెరలు కట్టి ప్రదర్శించడం వల్ల తమ ఆదాయానికి చాలా గండి పడుతోందని, వెంటనే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ పోలీసులను ఆశ్రయించింది దిల్ రాజు టీమ్.

netizen angry on dil raju for balagam movie shows
Dil Raju

పైరసీ యాక్ట్ కింద వెంటనే చర్చలు తీసుకోవాలని వారు కోర‌గా, పోలీస్ కంప్లైంట్ కి సంబంధించిన లెటర్ నెట్టింట వైరల్ గా మారింది. గ్రామాల్లో పెద్ద తెరను ఏర్పాటు చేసి సినిమాలు ప్రదర్శించడం పాత రోజుల్లో ఒక మర్చిపోలేని జ్ఞాపకం కాగా, ఇప్పుడు బలగం సినిమాతో మరోసారి రిపీట్ కావడం ఓ విశేషమైతే.. ఇదే అంశం సినిమా ప్రొడక్షన్ యూనిట్ కి నష్టం చేకూర్చుతోందని దిల్ రాజు చెబుతుండటం గ‌మ‌న‌ర్హం. మానవ సంబంధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సినిమా చేశాన‌ని చెప్పిన దిల్ రాజు ఊళ్లో ప్ర‌తి ఒక్క‌రు చూసేలా ఏర్పాట్లు చేస్తుండ‌డంపై కేసులు పెట్ట‌డం ఏంట‌ని కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago