Dil Raju : ఎలాంటి హంగామా లేకుండా థియేటర్‌లోకి వచ్చి కేవలం మౌత్ టాక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం బలగం. ఈ చిత్రం తెలంగాణలోని ప్రతీ పల్లెను కదిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను కురిపించింది. ఇక ఈ సినిమాని తెలంగాణలో ప్రతీ పల్లెలో పరదాలు కట్టి ప్రొజెక్టర్ల ద్వారా సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరు చూడాలనే లక్ష్యంతోనే నిర్మించాం. ఆ టార్గెట్ పూర్తవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని దిల్ రాజు సక్సెస్ మీట్‌లో పేర్కొన్నారు. మేము సినిమా ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నామని వస్తున్న విమర్శలు, ఆరోపణలు నిజం కాదు అని దిల్ రాజు అన్నారు.
మనుషుల మధ్య చెదిరిపోతున్న అనుబంధాలు, ఆప్యాయతలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ డైరెక్టర్ వేణు చేసిన బలగం చిత్రం ప్రస్తుతం ప్రతి ఊరిలో కూడా గ్రామ ప్రజలందరినీ ఒక్కటి చేస్తోంది. మొదట ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసిన దిల్ రాజు.. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. ఈ వేదికపై కూడా భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమాను.. ఊరూరా తెరలు కట్టి ప్రదర్శిస్తుండడంతో దీనిపై దిల్ రాజు పోలీస్ కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. బలగం సినిమాను కాపీ చేసి ఊరూరా తెరలు కట్టి ప్రదర్శించడం వల్ల తమ ఆదాయానికి చాలా గండి పడుతోందని, వెంటనే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ పోలీసులను ఆశ్రయించింది దిల్ రాజు టీమ్.
పైరసీ యాక్ట్ కింద వెంటనే చర్చలు తీసుకోవాలని వారు కోరగా, పోలీస్ కంప్లైంట్ కి సంబంధించిన లెటర్ నెట్టింట వైరల్ గా మారింది. గ్రామాల్లో పెద్ద తెరను ఏర్పాటు చేసి సినిమాలు ప్రదర్శించడం పాత రోజుల్లో ఒక మర్చిపోలేని జ్ఞాపకం కాగా, ఇప్పుడు బలగం సినిమాతో మరోసారి రిపీట్ కావడం ఓ విశేషమైతే.. ఇదే అంశం సినిమా ప్రొడక్షన్ యూనిట్ కి నష్టం చేకూర్చుతోందని దిల్ రాజు చెబుతుండటం గమనర్హం. మానవ సంబంధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సినిమా చేశానని చెప్పిన దిల్ రాజు ఊళ్లో ప్రతి ఒక్కరు చూసేలా ఏర్పాట్లు చేస్తుండడంపై కేసులు పెట్టడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.