Nepal VS Mangolia Highlights : పసికూన అనుకున్న నేపాల్ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగోలియాపై 20 ఓవర్లలో 314 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరచింది.ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి నేపాల్ 314 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.అంతర్జాతీయ టీ20లలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.2019లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గన్ 3 వికెట్లు నష్టపోయి 278 పరుగులు చేసింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన మంగోలియా నేపాల్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 19, వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ 16 పరుగులకే అవుట్ కావడంతో ఆరంభంలోనే నేపాల్‌కు భారీ షాక్ తగిలింది. అయితే, వన్‌డౌన్‌లో కుశాల్ మల్లా దిగగానే సీన్ రివర్స్ అయింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపిస్తూ మంగోలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 34 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా 50 బంతులు ఆడిన అతడు.. 137 రన్స్ చేశాడు. కుశాల్ మల్లా ఇన్నింగ్స్‌లో 8 ఫోర్స్, 12 సిక్స్‌లు ఉన్నాయి. ఈ అంకెలు చూస్తుంటే అతని బ్యాటింగ్ హవా ఏ రకంగా సాగిందో అర్ధం అవుతుంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును కుశాల్ మల్లా బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో మరో బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఆరీ (10 బంతుల్లో 52 పరుగులు) కూడా చెలరేగి ఆడాడు. దీపేంద్ర సింగ్ ఆరీ మంగోలియా బౌలర్లను ఉతికి ఆరేశాడు. 9 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్న అతడు.. టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే ఛేజింగ్‌లో మంగోలియా కేవలం 41 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో టీ20 క్రికెట్‌లో నేపాల్ చరిత్ర సృష్టిస్తూ.. ఏకంగా 273 రన్స్ భారీ తేడాతో విక్టరీ కొట్టింది. నేపాల్-మంగోలియా మ్యాచ్‌లో నమోదైన రికార్డులను ఒక్కసారి చూస్తే.. 34 బంతుల్లోనే సెంచరీ, 9 బంతుల్లో ఫిఫ్టీ, వరుసగా 6 సిక్సులు, టీ20 క్రికెట్ హిస్టరీలో హయ్యెస్ట్ స్కోరు, పొట్టి ఫార్మాట్లో భారీ విజయం ఇలా పలు రికార్డ్స్ నమోదయ్యాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…