MLA Kotamreddy Sridhar Reddy : 160 సీట్లు.. 57శాతం ఓట్లు.. వైసీపీకి ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్న కోటంరెడ్డి..

MLA Kotamreddy Sridhar Reddy : చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత టీడీపీ నాయ‌కులు దారుణ‌మైన విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వంతో పాటు ప‌లువురు మంత్రుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన సెంటర్ల సందర్శనకు, బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా? అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు. మధ్యవర్తులుగా మేధావులను (జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మినారాయణ) తీసుకురావచ్చునని, లేదా వైసీపీకి నచ్చిన వారిని తేవచ్చునని చెప్పుకొచ్చారు . అన్ని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సెంటర్లకు మీడియాతో సహా వస్తే అక్కడే లెక్కలు తెలుస్తామన్నారు. ఈ బహిరంగ చర్చకు సాక్షి పేపరు, టీవీ వచ్చినా పర్వాలేదని తమకు అభ్యంతరం లేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

ఇక టీవీ డిబేట్‌లో కోటం రెడ్డి జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగారు. అప్ప‌ట్లో ఏపీ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తాన‌ని చెప్పిన ఆయ‌న ఇప్పుడు రాష్ట్రానికి రాజ‌ధాని కూడా లేకుండా చేశార‌ని అన్నారు. జ‌గ‌న్‌తో పాటు మేమందరం కూడా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పాం. కాని ఆయ‌న చెప్పిన మాట‌లు ఒక్క‌టి జ‌ర‌గ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో జ‌గన్ దారుణ‌మైన ప‌రాజ‌యం చ‌విచూస్తాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,చంద్ర‌బాబు, లోకేష్ కాంబినేష‌న్‌లో 160 సీట్లు.. 57 శాతం ఓట్లు త‌ప్ప‌క వ‌స్తాయ‌ని కోటం రెడ్డి జోస్యం చెప్పారు. ఆయ‌న కామెంట్స్ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

MLA Kotamreddy Sridhar Reddy sensational comments
MLA Kotamreddy Sridhar Reddy

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను వైసీపీలో మెజార్టీ వర్గం వ్యతిరేకిస్తోందని ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాజకీయంగా నష్టపోతామని వైసీపీ నేతలే అంటున్నారని… వైసీపీ సానుభూతిపరుడైన ఓ పారిశ్రామికవేత్త ప్రశాంత్ కిషోర్ కు ఫోన్ చేసి చంద్రబాబు అరెస్ట్ పై ఆరా తీశారన్నారు. వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ప్రశాంత్ కిషోర్ చెప్పారని.. లోకేష్‍ని అరెస్ట్ చేస్తే వైసీపీకి మరింత నష్టమని ప్రశాంత్ కిషోర్ అన్నారని కోటంరెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్‍పై కేసులు పెట్టవద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కోటంరెడ్డి ప్రకటించారు.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

13 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

20 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago