Kodali Nani : భువ‌నేశ్వ‌రికి కొడాలి నాని కౌంట‌ర్.. జైల్లో ఉంటే దోమ‌లు కుట్ట‌క రంభ, ఊర్వశి వచ్చి కన్ను కొడతారా..

Kodali Nani : రాజ‌కీయాల‌కి చాలా దూరంగా ఉండే చంద్ర‌బాబు స‌తీమణి త‌న భ‌ర్త అరెస్ట్ అయ్యాక మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న భ‌ర్త త‌ర‌పున మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తుంది. ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చుక్కెదురు కావటంతో తండ్రి చంద్రబాబు బెయిల్ కోసం లోకేశ్ ఢిల్లీలోనే ఉన్నారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన క్రమంలో ఢిల్లీలోనే ఉన్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు రిమాండ్‌ను కోర్టు మరో 11 రోజులు పొడిగించింది. అయితే.. జైల్‌లో ఉన్న చంద్రాబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెంనాయుడు ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ అనంతరం భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి కొడాని నాని సెటైర్లు వేశారు.

జైల్లో చంద్రబాబు తినేందుకు కనీసం టేబుల్ అయినా వేయలేదని.. ఆయనకు దోమలు కుడుతున్నాయంటూ.. భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కొడాలి నాని.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జైల్లో దోమలు కాకుండా రంభా, ఉర్వశి వచ్చి ఆయనకు కన్నుకొడతాయా అంటూ సైటైర్లు వేశారు కొడాలి నాని. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎవరికైనా జైలులో ఒకే ట్రీట్ మెంట్ ఉంటుందని తెలిపారు. అలా కాదు.. తనకు ఆరోగ్యం బాలేదనో.. లేదా ఇంకేదైనా సమస్య ఉందని కోర్టుకు విన్నవించుకుంటే అందుకు తగినట్టుగా న్యాయస్థానం కొన్ని వసతులు కల్పించే అవకాశం ఉంది. అలా కోర్టు చెప్పిన సౌకర్యాలే జైల్‌లో ఉంటాయని చెప్పారు.

Kodali Nani strong counter to nara bhuvanewshwari
Kodali Nani

చంద్ర‌బాబు చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారని, భోజనం చేసేందుకు టేబుల్ కూడా లేదని భువనేశ్వరి బాధపడతున్నారని.. ఆయనకు వేడి నీళ్లు ఇవ్వాలని, టేబుల్ వేయాలని న్యాయస్థానం చెప్తేనే ఇస్తారంటూ కొడాలి నాని అన్నారు. ఇక జైల్లో ఆయనను దోమలు కుడుతున్నాయని అంటున్నారని.. మ‌రి దోమలపై ఆయన దండయాత్ర చేశారు కదా.. అవేమైన పగ తీర్చుకుంటున్నాయేమో పంచులు పేల్చారు.ఇక జైలుకు వెళ్లిన ప్రతీ ఒక్కరికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరి బాబు జైలుకు వెళ్లకుండా.. ప్రియా పచ్చళ్ల కోసం మామిడి కాయలు కొట్టేందుకు వెళ్లాడా అంటూ త‌న‌దైన శైలిలో సెటైర్స్ వేశారు కొడాలి నాని.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago