Dochevaarevarura Movie : థియేటర్స్‌లో రిలీజైన సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో థియేటర్స్ కన్నా ఓటీటీ వైపే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. నేటి నుండి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దోచేవారెవరురా స్ట్రీమింగ్ కాబోతుంది. మనీ, మనీ మనీ వంటి క్రైమ్ కామెడీ సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నాగేశ్వరరావు ఈ మూవీని తెరకెక్కించారు. ఈయన వన్ బై టూ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం, ధనలక్ష్మీ ఐలవ్యూ, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, ఫొటో, భూ కైలాస్ వంటి సినిమాలు కూడా తీసారు.
14 ఏళ్ల పాటు సినిమాలకి దగ్గరగా ఉన్న శివనాగేశ్వరరావు మళ్లీ మెగాఫోన్ పట్టుకున్నారు. తనకిష్టమైన జోనర్‌లోనే దోచేవారెవరురా వంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. ఇందులో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, ప్రణవ్ చంద్ర, మాళవికా సతీషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మార్చి 11న థియేటర్లలో విడుదలైన దోచేవారెవరురా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. చాలా గ్యాప్ తర్వాత తీసిన ఈ సినిమా ఆయనని ఎంతగానో నిరాశపరచింది. థియేటర్ రిలీజ్ తర్వాత సుమారు ఆరు నెలలకు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సెప్టెంబర్ 29 నుంచి దోచేవారెవరురా స్ట్రీమింగ్ అవుతుంది.
2009లో నిన్ను కలిశాక సినిమా తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు శివనాగేశ్వరరావు. దాదాపు 14 ఏళ్ల పాటు సినిమాలు తీయలేదు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా కూడా ఇది చాలా నిరాశపరచింది. ఇందులో తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, బెనర్జీ వంటి సీనియర్ నటులు అతిథి పాత్రల్లో మెరిశారు. ఐక్యూ క్రియేషన్స్ బ్యానర్‌పై బొడ్డు కోటేశ్వరరావు ఈ మూవీని నిర్మించారు. రోహిత్ వర్ధన్ సంగీతం అందించారు. అనుకున్న రేంజ్ సక్సెస్ మాత్రం ఆయనకు దక్కకపోవడంతో ఆయన తిరిగి సినిమాలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…