Nellore SP : గత కొద్ది రోజులుగా ఏపీలో వాలంటీర్స్ వ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.జనసేనాని పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ వలన సీక్రెట్‌గా ఉండాల్సిన ఇన్షర్మేషన్ అంతా బయటకు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. తాజాగా వాలంటీర్ల బాస్ ఎవరని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.ప్రజల డేటా సేకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రైవేట్ కంపెనీకి డేటా ఇవ్వడానికిఎవరు అనుమతించారని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల డేటా సేకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ప్రజల వ్యక్తిగత డేటా వెళ్తున్న ఆ ప్రైవేట్ కంపెనీలు ఎవరివని ఆయన అడిగారు. వైజాగ్ లో ఎలాంటి ఐడీ కార్డ్ లేకుండా ఒక యువతి వాలంటీర్ పేరుతో డేటా సేకరిస్తుండగా పట్టుకున్న వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్లు దోహదపడుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ పై పలువురు మంత్రులు, వైసీపీ నేతలు మండిపడ్డారు. నెల్లూరు జరిగిన సభలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన పవన్ మాత్రం తగ్గడం లేదు.
రీసెంట్‌గా నెల్లూరు ఎస్పీ అయిన తిరుమలేశ్వర్ రెడ్డి లీకైన ఒక వేలిమద్ర ఆధారంగా నకిలీ వేలిముద్ర తయారు చేస్తున్నారని.. ఆ తర్వాత ఆధార్ నంబర్ ద్వారా ఒక ఖాతా నుంచి మరో ఖాతాలోకి రూ.51.25 లక్షలు బదిలీ చేసుకున్నారని తెలిపారు. అంటే పర్సనల్ ఇన్ఫో లీక్ కావడం వల్లనే ఇలాంటి జరుగుతున్నాయని జనసైనికులు అంటున్నారు..ఇక పవన్ కళ్యాణ్.. ప్రజల నుంచి వ్యక్తిగత డేటా సేకరించాలని వీరికి ఎవరు ఆదేశాలిచ్చారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇచ్చాందా లేదా ముఖ్యమంత్రా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరూ అంటూ అడిగారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…