Nayanthara : పెళ్ళి పిల్లలు.. ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా గడిపేస్తున్నారు నయనతార, విఘ్నేష్ శివన్ జంట. పెళ్లి సమయంలో అనేక వివాదాలు వీరిని చుట్టు ముట్టగా, వాటన్నింటిని కూడా పక్కకు నెట్టి అటు విహారయాత్రలు..ఇటు ఆధ్యాత్మిక యాత్రలు ఏవీ మిస్ అవ్వకుండా.. ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా తమ కులదైవం దేవాలయంల ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ స్టార్ కపుల్. తంజావూర్ జిల్లా పాపనాశం సమీపంలోని కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన నయన్, విఘ్నేష్ శివన్ జంట అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్కడే తమ పిల్లల నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పిల్లల శ్రేయస్సు కోసం.. తమ జీవితంత పాటు తాము నటించే సినిమాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు ఈ జంట. అయితే నయనతార ఆ గుడికి వస్తున్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. అంతేకాదు.. వీరితో ఫొటోలు దిగటానికి ఫ్యాన్స్ చాలా ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే నయనతారకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. గుడిలో దర్శనం అనంతరం ఈ జంట అక్కడినుంచి వేరే చోటుకు బయలు దేరగా, అందుకకోసం వారు ట్రైన్ ఎక్కారు.
ఆ ఈ సమయంలో కొంతమంది ఫ్యాన్స్ ఆమెను తాకారు. దీంతో ఆమెకు కోపం వచ్చి వారి వైపు సీరియస్‌గా చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. . కాగా, నయనతార, విగ్నేష్ శివన్‌లు ‘ నాను రౌడీదా’ సినిమా సమయంలో ప్రేమలో పడగా, 2022లో ఓ గుడిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు. నయనతార ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకిరెడీ అయ్యింది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాలో.. షారుఖ్ ఖాన్ జోడీగా నటిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…