RP Patnaik : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. ఆయన వరుస హిట్స్ తో దూసుకుపోతుండగా, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో క్రేజీఈ ప్రాజెక్ట్ చేయనున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాతో మహేష్ రేంజ్ వేరే లెవల్‌కి వెళ్లనుంది. అయితే ఈ స్టార్ హీరో గురించి ఒకప్పటి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సంచలన కామెంట్స్ చేశారు.
ఆర్పీ పట్నాయక్ కు అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఆయన మ్యూజిక్ అందించిన చాలా సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఆయన మ్యూజిక్ ఆల్బమ్ కు అప్పట్లో చాలామంది ఫ్యాన్స్ కూడా ఉండేవారు. అయితే రాను రాను ట్రెండ్ ఛేంజ్ అవ్వడం, ఆయన మ్యూజిక్ బోర్ కొట్టేయడంతో ఆయనకు ఛాన్సులు తగ్గాయి.ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేని పట్నాయక్ అప్పుడపప్పుడు ఇంటర్వ్యూలతో లేదంటే పలు షోలలో సందడి చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్పీ మాట్లాడుతూ.. నేను ఇన్నేళ్ల నా కెరీర్ లో నిజం సినిమా విషయంలో మాత్రం చాలా తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన నిజం మూవీకి నేను సాంగ్స్ పాడటం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే మహేశ్ ది చిన్నపిల్లాడి వాయిస్. నా వాయిస్ ఆయనకు అస్సలు సెట్ కాదు. నిజం సినిమాలో నేను కొన్ని పాటలు పాడాను. ఆ తర్వాత కొంత మంది నాకు ఫోన్ చేసి తిట్టారు. ఛాన్స్ వస్తే ఎవరికైనా పాడేస్తావా అని నన్ను అడిగారు. దానికి నేను చాలా బాధపడ్డాను. అంత పెద్ద స్టార్ హీరోకు పాడాల్సిన గొంతు కాదు నాది అని ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…