Nayanthara : చూస్తుంటే తల్లిదండ్రులైన ఆనందం నయనతార, విగ్నేష్ దంపతులకు ఎక్కువ సేపు ఇచ్చేలా లేరు ఎవరూ. ఎందుకంటే ఈ ఇద్దరిపై అదేదో పగ బట్టినట్లు కోర్టులు, కేసులు అంటూ నానా రచ్చ చేస్తున్నారు.. ఏవేవో చర్చలు పెడుతున్నారు. తాజాగా జైలు శిక్ష అంటూ కొత్త చర్చ కూడా పుట్టుకొచ్చింది. సరోగసి పద్దతిలో అమ్మా నాన్న అయిన నయన్, విఘ్నేష్ శివన్‌కు ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా చుక్కలు చూపిస్తుంది. డబ్బులున్నాయి కదా అని అద్దె గర్భంతో అమ్మా నాన్నలైన ఈ దంపతులపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇక ఏడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందంటూ రచ్చ జరుగుతుంది. చట్టపరమైన చిక్కులు కూడా బాగానే వెంటాడేలా కనిపిస్తున్నాయి.
జూన్ 9న విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న నయనతార.. నాలుగు నెలలకే అమ్మ అయిపోయింది. పెళ్ళైన నాలుగు నెలలకే పిల్లలు పుట్టినట్లు ప్రకటించడంతో రచ్చ మొదలైంది. పెళ్లికి ముందే వీళ్ళిద్దరూ సరోగసీని నమ్ముకున్నారని అర్థమవుతుంది. సరోగసీ చట్టం గురించి పూర్తిగా తెలిసి అక్కడికి వెళ్లారా లేదంటే సెలబ్రెటిస్ కదా చూసి చూడనట్లు వదిలేస్తారులే అనుకున్నారా అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే వీళ్ళ కంటే ముందు చాలా మంది ఇలా అద్దె గర్భంతో అమ్మా నాన్న అయ్యారు. కానీ వాళ్లెవరికీ చిక్కులు రాలేదు. అయితే ఇప్పుడు చట్టం మారిపోయింది. అత్యవసరం అయితే తప్ప అటు వైపు వెళ్లకూడదని చట్టాలు చెప్తున్నాయి.
నిజంగా సరోగసీ పద్దతిలో నయనతార పిల్లల్ని కన్నట్లైతే వారికి శిక్ష తప్పదు.. ఎందుకంటే అక్కడి చట్టాన్ని నయనతార-విగ్నేష్ దంపతులు ఉల్లగించినట్లు స్పష్టంగా తెలుస్తుంది కూడా. చట్ట ప్రకారం పెళ్ళైన దంపతులు, విడాకులు తీసుకున్న వాళ్లు, భర్త చనిపోయిన ఒంటరి మహిళలు సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనవచ్చు. కానీ నయనతార-విగ్నేష్ ఏడేళ్ళగా సహజీవనం చేస్తున్నారు.. పైగా పెళ్ళికి 5 నెలల ముందుగానే ప్లాన్ చేసుకుని సరోగసీని ఆశ్రయించారు.
అంటే పెళ్లి కాకుండానే అమ్మా నాన్న కావాలనుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే సరోగసికి వెళ్లినపుడు మాత్రం నయనతార-విగ్నేష్ దంపతులు కాదు. తమిళనాడు గవర్నమెంట్ దీనిపై సీరియస్‌గానే ఉంది. మరోవైపు కొందరు న్యాయవాదులు సైతం కూడా నయన్ చేసిన పనిని తప్పు అంటున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైనెస్స్‌ని ఆదేశించారు తమిళనాడు హెల్త్ మినిష్టర్ సుబ్రమణ్యం. కవల పిల్లల పుట్టుకకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నయనతార దంపతులను ప్రభుత్వం కోరింది.
సరోగసీ నిబంధనలు నయనతార దంపతులు ఉల్లంఘించినట్లు తెలిస్తే మాత్రం 50 వేల జరిమానాతో పాటు 5 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఈ క్రమంలోనే తాము చేసిన పనికి లాయర్ల సలహాలు తీసుకుంటున్నారు నయనతార దంపతులు. భార్యాభర్తలు పిల్లల్ని కనడానికి అనుకూల పరిస్థితులు లేనపుడు.. ఏదైనా విపరీత ఆరోగ్య పరిస్థితులు ఉన్నపుడు మాత్రమే చట్టప్రకారం సరోగసికి వెళ్లొచ్చు కానీ నయన్ కేవలం తన అందం పాడైపోతుందనే కారణంతోనే సరోగసి వైపు వెళ్లిందని అర్థమవుతుంది. దాంతో ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో అర్థం కావడం లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…