Nayanathara : లేడి సూపర్ స్టార్ నయనతార కొన్ని నెలల క్రితం తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే. వీరి పెండ్లి వేడుకకు రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సూర్య, అట్లీ, ఇతర ప్రముఖ తారలు హాజరయ్యారు. ఇక పెళ్లైన కొద్ది రోజులకి దర్శకుడు విఘ్నేష్ శివన్, నటి నయనతార కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు. సరోగసీ ద్వారా తమ కుమారులను స్వాగతించిన ఈ జంట వివాదంలో కూడా చిక్కుకుంది. కొద్ది రోజులకి ఆ సమస్య సమసిపోయింది. అయితే ఇటీవల తమ పిల్లలతో కలిసి బయట కనిపించారు ఈ నయనతార, విఘ్నేష్ శివన్ జంట.
పిల్లల ఫేస్ కనపడనివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే వారికి పెట్టిన పేర్లను పూర్తిగా రివీల్ చేశారు. నయన్, విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లల్లో ఒక కొడుకు పేరు ‘ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్’ అని, రెండో కొడుకు పేరు ‘ఉలగ్ ధైవాగ్ ఎన్ శివన్’గా పెట్టినట్లుగా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ వార్తను పోస్ట్ చేశారు ఈ స్టార్ కపుల్. ఇటీవల ఓ ఈవెంట్‌లో నయన్ పాల్గొనగా, ఆమెను తన పిల్లల పేర్లు చెప్పాల్సిందిగా అక్కడ కోరారు. దీంతో అందరికీ క్లారిటీ ఇచ్చేందుకు ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఇవాళ తమ పిల్లల పూర్తి పేర్లను రివీల్ చేశాడు.
ఇక నయన్, విఘ్నేష్ గతేడాది జూన్ 9న ప్రేమవివాహం చేసుకోగా, అంతకముందు ఏడేళ్లపాటు ప్రేమలో మునిగి తేలారు. మరోవైపు నయనతార పెళ్లైన తర్వాత కూడా సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ వరుస సినిమాలలో నటిస్తున్న హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార నిర్మాతగా మారనుందని అంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న నయనతార ప్రస్తుతం షారూఖ్‌తో సినిమా చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…