Naresh Pavitra Lokesh Marriage : గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర వ్యవహారం టాలీవుడ్‌లో ఎంత చర్చనీయాంశం అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరు సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారాలు సాగాయి. వీటన్నింటిని మధ్య అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది. సంప్రదాయబద్దంగా మూడుముళ్లు ఏడడుగులు వేసిన జంట. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ప్రారంభాలు అని.. అందరి ఆశీస్సులు కావాలంటూ తమ రిలేషన్ గురించి నరేష్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నరేష్ అలా వీడియో షేర్ చేశాడో లేదో అది తెగ వైరల్ అయింది.
నరేశ్‌కు ఇది నాలుగో పెళ్లి కాగా పవిత్ర లోకేశ్‌కు రెండో పెళ్లి కావడం గమనార్హం. కాగా పెళ్లి తర్వాత నరేశ్- పవిత్ర హనీమూన్ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. తాజాగా నరేష్.. `ఇంటింటి రామాయణం` అనే సినిమా ప్రెస్ మీట్లో ఆయన పెళ్లి ప్రస్తావన రాగా, ఆ సమాధానం దాటవేశారు. సినిమా గురించే మాట్లాడదామని చెప్పారు. అనంతరం మరోసారి అదే ప్రశ్న ఎదురయ్యింది. ప్రభాస్, సల్మాన్ ఖాన్‌ల పెళ్లి కంటే ఇప్పుడు మీ పెళ్లి మ్యాటరే హాట్ టాపిక్ అవుతుంది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఎప్పుడు పెళ్లి భోజనం పెట్టబోతున్నారని ప్రశ్నించారు.
![Naresh Pavitra Lokesh Marriage : పవిత్రతో పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చిన నరేష్.. అసలు మేటర్ ఇదే..! Naresh Pavitra Lokesh Marriage is it really done they explained](http://3.0.182.119/wp-content/uploads/2023/03/naresh-pavitra-lokesh-marriage.jpg)
అయితే దానికి సంబంధించి త్వరలోనే ఓ ప్రెస్ మీట్ పెడతాను అని అన్నారు. రీల్ లైఫ్, రియల్ లైఫ్ ప్రతి వ్యక్తికి ఉంటాయి కాబట్టి నా లైఫ్‌ని నేను జీవిస్తున్నా. ఈ ప్రెస్ మీట్‌ని మరో విధంగా డైవర్ట్ చేయదలుచుకోవడం లేదు అని నరేష్ స్పష్టం చేశారు. మరి ఇది నిజమైన పెళ్లా?, సినిమా పెళ్లా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. న్యూఇయర్ సందర్భంగా ఓ వీడియోని నరేష్ రిలీజ్ చేయగా, అందులో ఏకంగా పవిత్రకి ముద్దు కూడా పెట్టేశాడు. దీనిపైనే ఇంకా ఆసక్తికర చర్చలు నడుస్తున్న సమయంలోనే ఇలా పెద్ద షాక్ ఇచ్చాడు నరేష్.