Rana Naidu Review : ఇటీవల ఓటీటీ కల్చర్ ఎంతగా పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఓటీటీలో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో అలరింపజేస్తున్నాయి. అయితే తొలిసారి విక్టరీ వెంకటేష్, రానా ఓటీటీలో వెబ్ సిరీస్‌తో అలరించే ప్రయత్నం చేశారు. రానా నాయుడు అనే టైటిల్ తో నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ లో వెంకటేష్, రానా.. తండ్రి-కొడుకులుగా కనిపించారు. బాలీవుడ్ డైరెక్టర్స్ కరణ్ అన్షమాన్, సువర్ణ్ వర్మ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయగా, ఇది అమెరికన్ సిరీస్ ‘రే డోనోవన్’కు ఇది అడాప్టేషన్ గా తెరకెక్కింది. బసుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో కనిపించారు.
వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. రానా నాయుడు(రానా) బాలీవుడ్ లో వచ్చే ఎలాంటి స్కాండిల్ ని అయినా చాలా ఈజీగా ఫిక్స్ చేస్తూంటాడు. అతనికి మాత్రం తండ్రి నాగ నాయుడు (వెంకటేష్ ) పెద్ద సమస్యగా మారతాడు. హైదరాబాద్ చంచల్ గూడా జైలు నుంచి ఐదేళ్లు ముందే బయిటకు వచ్చి, ముంబైలో వెలిగిపోతున్న తన కొడుకు రానా దగ్గరకు వెళతాడు. అసలు అతడినికి జైలుకి పంపింది రానానే. అసలు రానా కు తన తండ్రినే జైలుకు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇద్దరి మధ్య విభేదాలు ఎందుకు ఏర్పడ్డాయని రానా నాయుడు చూస్తే తెలుస్తుంది.
రెగ్యులర్ గా ఇంగ్లీష్ వెబ్ సీరిస్ లు చూసేవారికి ఇది పెద్దగా ఇబ్బంది అనిపించదు కాని, మన తెలుగు హీరోలు అయిన రానా, వెంకటేష్ లను ఆ పాత్రలలో చూసి జీర్ణించుకోవటం కాస్త ఇబ్బందిగా అనిపించిందనే చెప్పాలి.. కథలో ఎంగేజ్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఓ సారి కనెక్ట్ అయితే మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఇందులో మొదటి ఎనిమిది ఎపిసోడ్స్ రకరకాల పాత్రలు, వాటి మధ్య రిలేషన్స్, కాంప్లిక్ట్స్ లను ఎస్టాబ్లిష్ చేస్తూ కొత్తగా అనిపిస్తుంది.. కొన్ని పాత్రలు అయితే మనకు వింతగా కూడ అనిపిస్తాయి. ముఖ్యంగా స్పిరుట్యువల్ గురు పాత్ర అయితే చాలా నచ్చుతుంది. ఎన్ని లోపాలు ఇందులో ఉన్నా కూడా వాటిని క్లైమాక్స్ కవర్ చేస్తుంది. ఇందులో నటీనటులు తమ పాత్ర పరిధి నటించి మెప్పించారు.