Naresh : గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో నరేష్- పవిత్రా లోకేష్ గురించి తెగ కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఇదివరకే ఆయన మూడో భార్యకు సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలవగా, త్వరలోనే విడాకులు కూడా తీసుకుపోతున్నట్లు వివరణ ఇచ్చాడు. ఇక ఆ విషయంలో నిత్యం ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. పవిత్రకి లిప్ లాక్ ఇచ్చిన దగ్గర నుండి ఆయనపై మరింత ఎక్కువగా మీమ్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో నరేష్ మరోసారి పోలీసులను ఆశ్రయించి సోషల్ మీడియాలో కొంతమంది తప్పుగా తనపై తప్పుడు వార్తలు ప్రచారాలు చేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు. మొన్నటి వరకు సినిమా షూటింగులతో బిజీగా ఉన్న నరేష్ శుక్రవారం రోజు హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ ఇచ్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఫిల్మ్ క్రిటిక్స్ అంటే సినిమాల గురించి మాట్లాడాలని.. వ్యక్తిగత విషయాల గురించి వారికి ఏంపని అని ప్రశ్నించారు. కొందరు సినిమారంగానికి చెందిన వారు కూడా ఇబ్బంది పెట్టే విధంగా వేర్వేరు నెంబర్ల నుంచి కాల్స్ చేస్తూ వేధిస్తున్నారని, వీటిపై సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశానని, కోర్టులో కేసు వేశానని నరేష్ అన్నారు. అయితే గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి దర్యాప్తు వివరాలు తెలుసుకోవడానికే వచ్చాడని ఏసీపీ తెలిపారు. కొత్తగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పవిత్రా లోకేష్ వ్యవహారంలో సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సైబర్‌క్రైమ్స్ పోలీసులు కోరడంతో నరేష్ స్వయంగా వచ్చి ఇచ్చినట్టు తెలుస్తోంది.
గత ఏడాది నవంబర్ 27వ తేదీన మొదట నరేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. పలు వెబ్ సైట్స్ అలాగే యూట్యూబ్ ఛానల్ పై కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చారు.. దాదాపు 15 యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్స్ కు ఇదివరకే నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ట్రోల్స్ పై కూడా ఆయన సీరియస్ అవుతూ పోలీసులను ఆశ్రయించారు. ఇక కొన్ని వారాల క్రితం నరేష్ తన మాజీ భార్య రమ్య రఘుపతి నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది అని తనపై దాడి చేసేందుకు కూడా ఆమె ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆయన కొన్ని వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏదేమైన ఇటీవలి కాలంలో నరేష్, పవిత్రలు ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…