Nagababu : మెగా బ్రదర్ నాగబాబు అప్పుడప్పుడు సంచలన కామెంట్స్ తో వార్తలలో నిలుస్తుంటాడు. అయితే ఎప్పుడు ప్రత్యర్ధులపై విరుచుకుపడే నాగబాబు రీసెంట్‌గా తమ ఇంటి హీరోలు తనకు సినిమాలలో ఛాన్స్‌లు ఇవ్వడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా ఇంట్లో చాలా మంది హీరోలున్నారు. కానీ, నాకు ఎవరూ ఎప్పుడూ ఏ క్యారెక్టర్ ఇవ్వలేదు. ఫస్ట్ టైమ్ సుస్మిత నాకు అవకాశం ఇచ్చింది. అంటే ఇది రెండోది. ఇంకో వెబ్ సిరీస్‌లో కూడా అవకాశం ఇచ్చింది’ అని అన్నారు మెగా బ్రదర్ నాగబాబు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల దంపతులు నిర్మించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’ ఈ నెల 18న విడుదల కానుండగా, ఇందులో తండ్రి పాత్రలో నటించారు నాగబాబు.
అయితే చిరంజీవి తమ్ముడి హోదాలో హీరో కావాలనుకున్న నాగబాబు అదృష్టం కలిసి రాక నిర్మాతగా మారాడు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆయన చేసిన చాలా సినిమాలు నిరాశపరిచాయి. చిరంజీవి చేసిన సినిమాలన్నీ ఫ్లాప్. ఆ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్, చరణ్, అల్లు అర్జున్ లను కూడా వదల్లేదు. చరణ్ హీరోగా నాగబాబు నిర్మించిన ఆరెంజ్ అయితే అతి పెద్ద డిజాస్టర్. ఆ మూవీ తెచ్చిన నష్టాలకు నాగబాబు జీవితం తలకిందులైంది. ఇక మెగా హీరోలకు నాగబాబు నుండి మరో బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. చిరంజీవి మూవీలో నాగబాబు ఉన్నాడంటే దాదాపు ప్లాప్. మృగరాజు, అంజితో పాటు పలు చిత్రాల్లో ఈ సెంటిమెంట్ నిజమైంది.
అయితే నాగబాబు ఇతర హీరోల సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్నా మెగా హీరోల సినిమాలలో కనిపించడం అరుదు. ఇతర హీరోలు ఆయనకు వేషాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబంలో ఉన్న ఏడెనిమిది మంది హీరోలు ప్రతి మూవీలో ఒక వేషం ఇస్తే చాలు. ఫుల్ బిజీ అయిపోతాడు. కాని ఎందుకో నాగబాబు మెగా హీరోల సినిమాలలో కనిపించడు. ఇప్పుడు చిరంజీవి పెద్దమ్మాయి నిర్మించిన శ్రీదేవి శోభన్ బాబు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మంచి హిట్ కావాలని ఆయన ఇటీవల వేదికపై చెప్పుకొచ్చాడు. ఏదేమైన నాగబాబు చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…