Nara Lokesh : మరి కొద్ది రోజులలో ఎలక్షన్స్ సమీపిస్తుండగా, చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగిస్తూనే ఉంది. టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి జగన్ ప్రభుత్వం వరుస షాకులు ఇస్తూనే ఉంది. ఇప్పటికే అనేక కేసుల్లో తలనొప్పి ఎదుర్కొంటున్న చంద్రబాబుకు తాజాగా మరొక కేసు ఇబ్బందిగా మారనుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది.చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ3 గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు మరొక కేసులో ఇరుక్కున్నట్టు అయింది.
ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. కేసులో చంద్రబాబు నాయుణ్ని A3గా చేర్చారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయాన్ని ఏసీబీ కోర్టుకు తెలిపారు. న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు పిటిషన్‌ను అనుమతించింది. ఎఫ్ఐఆర్ నంబర్ – 18/2023తో కేసు నమోదైంది. ఏ1గా ఐఎస్ నరేష్, ఏ2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఏ3 గా చంద్రబాబు నాయుడి పేర్లు నమోదు చేశారు. చంద్రబాబుపై మరొక కేసు పెట్టడంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన తండ్రి చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మద్యం అనుమతుల కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు. కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డో, ప్రెసిడెంట్ మెడల్ బ్రదర్ అంటూ ఘాటుగా స్పందించారు. పిచ్చికి వాడుతున్నట్టే కక్ష సాధింపు ధోరణికి కూడా మందులు వాడాలని అన్నారు. ఇప్పటికే పిచ్చికి లండన్ మందులు వాడుతున్నట్టే… కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిదంటూ ఎద్దేవా చేసారు. జగన్ తెచ్చిన పిచ్చి మందుకి 35 లక్షల మంది వివిధ రోగాల బారిన పడ్డారు. 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యపాన నిషేధం పేరుతో లక్షకోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్ చంద్రబాబు గారి పై కేసు పెట్టడం వింతగా ఉంది. ఆరోగ్యం పాడైన ప్రతి ఒక్కరూ జగన్ మీద కేసు పెడితే 35 లక్షలు కేసులు పెట్టొచ్చు అని లోకేష్ పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…