Aishwarya Arjun : క‌మెడీయ‌న్ కుమారుడితో అర్జున్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

Aishwarya Arjun : ఇటీవ‌లి కాలంలో సినీ ప్ర‌ముఖుల ఇళ్ల‌లో పెళ్లి సంద‌డి నెల‌కొంటుంది. న‌వంర‌బ్ 1న‌ వరుణ్‌-లావణ్య త్రిపాఠీలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుండగా.. వెంక‌టేష్ కూతురు వ‌చ్చే ఏడాది ఓ డాక్ట‌ర్‌ని పెళ్లి చేసుకోనుంది. ఇక మరో సినీ సెలబ్రెటీ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. యాక్షన్‌ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య.. తమిళ నటుడు తంబీ రామయ్య కొడుకు, ఉమాపతి రామయ్యతో రీసెంట్‌గా ఘనంగా ఎంగేజ్‌మెంట్ జరుపుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట అక్టోబర్ 27న చెన్నైలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థపు వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఐశ్వ‌ర్య అర్జున్‌, ఉమాప‌తి నిశ్చితార్థ వేడుక శుక్ర‌వారం చెన్నైలో అర్జున్ నిర్మించిన హ‌నుమాన్ టెంపుల్‌లో జ‌రిగింది. ఐశ్వ‌ర్య అర్జున్‌, ఉమాప‌తి పెళ్లి 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో జ‌రుగ‌నున్న‌ట్లు ఇరు కుటుంబ‌స‌భ్యులు ప్ర‌క‌టించారు. ఐశ్వ‌ర్య అర్జున్ త‌మిళంలో రెండు, క‌న్న‌డంలో ఓ సినిమాలో న‌టించింది. తెలుగులో విశ్వ‌క్‌సేన్ హీరోగా తండ్రి అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను అనౌన్స్‌చేశారు. కానీ సెట్స్‌పైకి రాక‌ముందే ఈ తెలుగు సినిమా ఆగిపోయింది. ఉమాప‌తి రామ‌య్య కూడా త‌మిళంలో థాన్నే వండి, తిరుమాన‌మ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో న‌టించాడు.

Aishwarya Arjun engagement video viral
Aishwarya Arjun

తమిళంలో అర్జున్‌ హోస్ట్ గా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి పాల్గొన్నాడు. అప్పుడే ఐశ్వర్యతో పరిచయం ఏర్పడటం, తర్వాతి రోజుల్లో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడం జరిగింది. ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడటంతో, వీరి పెళ్లికి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. కుమారుడు ఉమాపతి తన ప్రేమ విషయం చెప్పిన వెంటనే ఒప్పుకున్నానని, తనకు చాలా సంతోషంగా ఉందని తంబి రామయ్య ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉమాపతి పుట్టినరోజు సందర్భంగా నవంబరు 8న పెళ్లి తేదీని ప్రకటిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, థాయ్ లాండ్ లో ఐశ్వర్య – ఉమాపతిల వివాహం జరిపించాలని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago