Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ప్రజాచైతన్యమే లక్ష్యంగా మొదలుపెట్టిన పాదయాత్ర సరిగ్గా రాఖీ పౌర్ణమి రోజున 2700కి.మీ చేరుకుంది. దీంతో టీడీపీ శ్రేణులతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఆయనతో పాదయాత్రలో పాల్గొన్నారు. అభినందనలు తెలిపారు. యువగళం పాదయాత్ర 200రోజులు పూర్తి కావడంతో నారా లోకేష్ తల్లి నారా భువనేశ్వరితో పాటు నారా కుటుంబ సభ్యులు, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ యువగళం పాదయాత్రలో ఆయనతో కలిసి నడిచారు. హీరో, లోకేష్ సోదరుడు నారా రోహిత్ సైతం ఈయువగళం పాదయాత్రలో అన్నతో అడుగులో అడుగు వేశాడు.
కొయ్యలగూడెంలోని గిరిజనులతో ముఖాముఖి సమావేశమయ్యారు. వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు లోకేష్. 200రోజులు 2700కిలో మీటర్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వివిధ వర్గాలపై పెట్టిన అక్రమ కేసులను టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఎత్తేస్తామని మాటిచ్చారు లోకేష్. గతంలో చెప్పినట్లుగా అక్క, చెల్లెళ్లు లేని తనకు లక్షలాది మంది ఆడపడుచులు ఉన్నారన్నట్లుగా లోకేష్ చేయ్యి రాఖీలతో నిండిపోయింది.
యువగళం పాదయాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల యువగళం పాదయాత్రలో అందరితో పాటు పసుపురంగు టీషర్టు వేసుకున్న ఒక బాలుడు పాల్గొనడాన్ని లోకేష్ గమనించారు. ఉత్సాహంగా యాత్రలో పాల్గొంటున్న ఆ బాలుడ్ని లోకేష్ దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించి కుశలప్రశ్నలు వేశారు. చదువుకునే చిన్న పిల్లలు ఇలా పార్టీ రాజకీయాల కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది కాదని లోకేష్ భావించారు. ఆపై ఆ బాలుడితో “ఇప్పుడే రాజకీయాలు వద్దురా. ముందు మంచిగా, బాగా చదువుకో ” అని వాడు వేసుకున్న టీషర్టు తీయించి నచ్చజెప్పి పంపించేశారు. ఇక ఇటీవల టీ తాగుతూ సందడి చేశారు. టీ షాపు వారితో సరదాగా ముచ్చటిస్తూ జోకులు కూడా వేసారు. ఇక టీ తాగినందుకు డబ్బులు కూడా ఇవ్వబోయాడు. వారు మాత్రం నో అంటూ తెగ నవ్వేసారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…