Nara Lokesh : జగన్ నియంత పాలనపై కలిసి పోరాడాలని టీడీపీ, జనసేన భావిస్తుంది. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా లోకేష్, పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తున్నారు. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఫోన్లో లోకేష్ ను పరామర్శించారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయించి వేధించడం జగన్ కు అలవాటుగా మారిందంటూ పేర్కొన్నారు. నియంతలా జగన్ సాగిస్తున్న అరాచకాలపై అంతా కలిసి పోరాడుదామని పవన్ కళ్యాణ్.. లోకేష్ తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలంటూ నారా లోకేష్ కు పవన్ సంఘీభావం తెలిపారు.
ఇక లోకేష్ కూడా పవన్ కళ్యాన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నగా భావించే పవన్ కళ్యాణ్ తమకు సంఘీభావం తెలపడం పట్ల లోకేష్ థ్యాంక్యూ అని అన్నారు. తాను ఒంటరి అయ్యాననే ఫీలింగ్ లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ తమకు అండగా ఉన్నారన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డారన్నారు. జోహా కంపెనీ సీఈవో శ్రీధర్ కూడా తమకు మద్దతు పలికారన్నారు. అలాగే లక్షలాదిమంది కార్యకర్తలు తమకు అండగా నిలిచారని.. ఇంతమంది సపోర్ట్ చేస్తుంటే తాను ఒంటరి వాడిని ఎందుకవుతానంటూ సమాధానమిచ్చారు. టీడీపీ తలపెట్టిన బంద్ కు సహకరించిన ప్రజలు, పవన్, మంద కృష్ణ మాదిగ, కమ్యూనిష్టులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సంక్షేమమే తప్ప అవినీతి చేయడం తమ కుటుంబంలోనే లేదని అన్న లోకేష్.. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు, రాష్ట్రం, దేశం తప్ప వేరేమీ ఆలోచించని వ్యక్తి అన్నారు. ఆయన ఎప్పుడూ ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి గురించే ఆలోచిస్తారని.. చంద్రబాబు అంటేనే ఓ బ్రాండ్ అన్నారు. ఈ విషయాన్ని ఎన్నో కంపెనీల సీఈవోలూ చెబుతారని.. అలాంటి వ్యక్తిపై దొంగకేసు పెట్టి జైలుకు పంపారన్నారు. చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో ఎప్పుడూ లేనంత స్పందన వచ్చిందని.. చంద్రబాబు జోలికి రావడం జగన్ చేసిన అతిపెద్ద తప్పన్నారు. జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలతో యువగళానికి తాత్కాలిక విరామం ఇచ్చినట్లు లోకేష్ ప్రకటించారు. అన్నీ సర్దుకున్న తర్వాత మళ్లీ యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…