Roja : చంద్రబాబుకు రిమాండ్ విధించిన తర్వాత ఏపీ మంత్రి రోజా తిరుపతిలో తన ఇంటి ముందు సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. . వైసీపి నాయకులు, కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు చేసిన తప్పుకు ఇది ఆరంభం మాత్రమే..అన్నారు. ఇక చంద్రబాబు చేసిన తప్పులు అన్ని బయట పెడుతామని చెప్పిన రోజా. ..చంద్రబాబు చేసిన ప్రతి కుంభకోణంను బయటకు తీసుకొస్తామన్నారు మంత్రి. 2014 నుండి 2019 వరకూ చంద్రబాబు చేసిన ప్రతి తప్పుకు మా వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆమె పేర్కొంది.. సింగపూర్ లో ఈశ్వర్ అండ్ మినిస్టర్ ఎప్పుడైతే అరెస్టు అయ్యాడో ఆ నాటి నుండి నేటి వరకూ అన్ని బయటకు వస్తున్నాయన్నారు.
ఇక రోజా తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబుతో పాటు లోకేష్, అచ్చెన్నాయుడుపై కూడా విరుచుకుపడింది. అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబుకి శిక్ష పడాలని స్వామి వారిని కోరుకున్నట్టు తాను తెలియజేశారు. చంద్రబాబుపై అక్రమ కేసు అని అంటున్నారని, ఇది అడ్డంగా దొరికి కేసు అని ఆమె అభివర్ణించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ఇక లోపలే ఉంటాడు, లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ కూడా జైలుకి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలంటూ రోజా వార్నింగ్ ఇచ్చింది.
చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా ఏపీ బంద్ ప్రకటించారు. అయితే భువనేశ్వరి,బ్రాహ్మణి మాత్రం తమ హెరిటేజ్ సంస్థని తెరిచారని ఆమె పంచ్ వేసింది. ఇక రానున్న రోజులలో చంద్రబాబుపై అనేక కేసులు బయటకు రానున్నాయి. ఇంతకాలం వ్యవస్థలని మేనేజ్ చేసుకుంటూ చంద్రబాబు పబ్బం గడిపారు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండడు అని రోజా చెప్పుకొచ్చింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో పెను సంచలనంగా మారాయి. మరి రోజా చేసిన కామెంట్స్‌కి టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…