Abhinaya Great Words On Vishal : మాట్లాడలేకపోయిన, వినలేకపోయిన కూడా అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల నటి అభినయ. నటించడం ఆమెకి దేవుడు ఇచ్చిన వరం. తన నటనతో సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినయ చాలా సినిమాలలో నటించింది. తాజాగా ఆమె విశాల్ నటించిన మార్క్ ఆంటోని అనే చిత్రంలో నటించింది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభినయ తన సైన్ భాషతో తనలోని సంతోషాన్ని, భావాలను పంచుకుంది.అభినయ స్టేజ్ మీద మూగ సైగలతో తన భావాన్ని చెబుతుంటే.. కింద నుంచి ఆమె అసిస్టెంట్, ప్రాంప్టర్ తెలుగులో ఆ అర్థాన్ని చెప్పుకుంటూ పోయింది.
మార్క్ ఆంటోని సినిమాలో నాకు మంచి పాత్రను ఇచ్చారు. అంత మంచి కారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్.. నేను ఇందులో విశాల్ భార్యగా నటించాను.. నాకు విశాల్ అంటే చాలా ఇష్టం. ఆయన మొదటి సినిమా నుంచి అన్నీ చూశాను.. ఆయనంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి పూజా సినిమాలో మొదటిసారిగా నటించాను. అప్పుడు అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్ చెప్పుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు చెబుతున్నాను. మళ్లీ ఇన్నేళ్లకు ఇలా మార్క్ ఆంటోనిలో విశాల్‌తో కలిసి నటించాను అన పేర్కొంది అభినయ.
విశాల్ భార్యగా నటించడం ఆనందంగా ఉందని తెలియజేసిన అభినయ… సెట్‌లో ఎంతో సరదాగా ఉండేవాళ్లం.. కానీ ఒక్కసారి యాక్షన్, షాట్ అని చెప్పగానే ఎంతో సీరియస్‌గా అయిపోతారు.. విశాల్ నా సైన్ భాషను అర్థం చేసుకుంటారు.. నాతో బాగా మాట్లాడుతుంటారు.. అంటూ విశాల్ మీద తన మీద ప్రేమని వ్యక్తపరచింది. విశాల్, అభినయ ప్రేమ, పెళ్లి గురించి జరిగిన ప్రచారం, వచ్చిన రూమర్ల గురించి అందరికీ తెలిసిందే. ఒకానొక టైంలో వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు తారాస్థాయికి వెళ్లాయి. ఇక ప్రతీ సారి ఇలా పెళ్లి మీద రూమర్లు వస్తుండటంతో విశాల్ స్పందిస్తూనే ఉన్నారు.. తన పెళ్లి ఫిక్స్ అయితే అందరికీ చెబుతాను, అందరికీ చెప్పి చేసుకుంటాను అని క్లారిటీ ఇచ్చాడు. మార్క్ ఆంటోని చిత్రంలో దర్శకుడు ఎస్ జే సూర్య కీలక రోల్ చేశారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. సెల్వ రాఘవన్ మరో కీలక రోల్ చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…