Nara Lokesh : కేటీఆర్ వ్యాఖ్య‌ల‌కి కౌంట‌ర్ ఇచ్చిన నారా లోకేష్‌

Nara Lokesh : ఏపీ రాష్ట్రానికి సంబంధించిన అంశంపై తెలుగోళ్లు హైదరాబాద్‌లో నిరసన తెలపడం శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కి గాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ త‌న‌దైన శైలిలో స్పందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగోళ్లు ప్రపంచ వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలిపారని.. హైదరాబాద్‌లో కూడా తెలుగువాళ్లు ఉండటంతో శాంతియుతంగానే నిరసన తెలిపారని లోకేష్ వ్యాఖ్యానించారు. ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా టీడీపీ అభిమానులు ప్రవర్తించలేదని.. అయినా వాళ్లు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్ధం కావడం లేదని కేటీఆర్‌ను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఏపీలో టీడీపీ నేతల అరెస్టుపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

జగన్ పాలన, ప్రతిపక్షాల అణిచివేతపై రాష్ట్రపతికి తాము వివరించినట్లు లోకేష్ తెలిపారు. భవిష్యత్‌కు గ్యారంటీ అని తమ నాయకుడు చంద్రబాబు, యువగళంతో తాను, వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్.. ఇలా ముగ్గురుం ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుంటే భయపడిపోయిన జగన్ అక్రమ అరెస్టులు చేసి తమను నిర్బంధిస్తున్నారని లోకేష్ స్ప‌ష్టం చేశారు. చంద్రబాబును రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని ఆధారాలు ఇవ్వాలని సీఐడీ అధికారులు వేడుకున్నారని.. ఒకవేళ ఆధారాలు ఉంటే మీడియా ముఖంగా ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశంపై తాము ఓ వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకువచ్చి వివరిస్తున్నామని.. తాము ఏ కంపెనీ దగ్గర కనీసం కప్పు కాఫీ కూడా తాగలేదని.. అలాంటిది అవినీతి ఎలా చేస్తామని లోకేష్ నిలదీశారు.

Nara Lokesh counter to ktr comments
Nara Lokesh

అయితే అంత‌క‌ముందు కేటీఆర్ మాట్లాడుతూ..నాకు నారా లోకేష్ ఫోన్ చేసి ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు..? అని అడిగారు. శాంతి భద్రతలు ఏం కావాలని నేను అడిగాను. తెలంగాణ ఉద్యమ టైమ్‌లో కూడా ఐటీ కారిడార్‌లో ఆందోళనలు జరగలేదు. అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి ర్యాలీలను అనుమతించలేదు. నాకు నారా లోకేష్, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ అందరూ దొస్తులే. నాకు ఆంధ్రలో ఎలాంటి తగాదాలు లేవు. ఇక్కడ లేని పంచాయితీ ఎందుకు పెడుతున్నారు..?. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు..?. అసలు ఏపీతో మాకేంటి సంబంధం.. దాన్ని మాకు ఎందుకు చుడుతున్నారు. మాకు ఒక పార్టీగా ఆ అంశంపై ఎలాంటి అసక్తి లేదు. మా పార్టీ వాళ్లు ఏదైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం. దానికి మా పార్టీకి సంబంధం లేదు..అది పార్టీ స్టాండ్ కాదు’ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

6 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

6 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

6 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

7 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

7 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

7 months ago