Nara Brahmani : ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ.. ఈ కేసులో ఆయన బయటపడినా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలు, ఏపీ ఫైబర్ నెట్ స్కాం వంటి ఇతర కేసుల్లో ఆయన్ను అరెస్టు చేసి జైల్లోనే కొనసాగించేందుకు సిద్దమవుతోంది. అంతే కాదు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను కూడా త్వరలో అరెస్టు చేస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.ఈ విషయంలో నిజమెంత ఉందో తెలియదు కాని, నందమూరి నారా వంశాలకు సంబంధించిన బ్రాహ్మణి టీడీపీని నడిపించబోతుందని ప్రచారం జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీకి ఊహించిన విధంగా పరిమాణాలు ఎదురయ్యాయి ఒకసారిగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆపై రిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రభావం అంత ఆయన కొడుకు నారా లోకేష్ పై పడింది. పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ఒక్కసారిగా పార్టీ భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. అయితే ఆయన అరెస్ట్ కూడా అరెస్ట్ జరుగుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని ఎవరు నడిపిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి తరుణంలో నందమూరి వారి అమ్మాయి నారావారి కోడలు అయిన నారా బ్రాహ్మణి ప్రస్తుతం కి రోల్ గా మారారు తన మామ చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ మొట్టమొదటిసారిగా మీడియాతో మాట్లాడారు.
తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునే విధంగా అధికార పార్టీని ఎండగడుతూ ఆమె ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైతే నారా బ్రాహ్మణి పార్టీని నడిపిస్తారు అన్నప్రచారాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా జరుగుతున్నాయి. నందమూరి తారక రామారావు కొడుకు అయినా బాలకృష్ణ మరోపక్క ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి ఇరువురు కూడా పార్టీ నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సైతం బాలకృష్ణ తనదైన శైలిలో అధికార పార్టీపై మీసాలు తిప్పుతూ ఛాలెంజ్లు విసురుతూ. ఎక్కడా తగ్గేది లేదంటూ మీడియా ముఖంగా అధికార పార్టీకి హెచ్చరికల జారీ చేశారు. తండ్రి ఆ విధంగా ఉండగా ఇక్కడ కూతురు మరియు నారావారి కోడలు అయిన నారా బ్రాహ్మణి పార్టీలో విషయాలన్నీ లోతైన అన్వేషణతో అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది. తెరమీదకు యనమల రామకృష్ణుడు కనిపిస్తున్నప్పటికీ తెర వెనక నారా బ్రాహ్మణి మొత్తం చక్రం తిప్పుతున్నట్టు ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…