Manchu Lakshmi : మంచు వారమ్మాయి మంచు లక్ష్మీ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కాంట్రవర్సీస్‌తో ఎక్కువగా వార్తలలోకి ఎక్కుతుంటుంది.మంచు లక్ష్మీ వారం రోజుల క్రితం.. అంటే ఈనెల 14వ తేదీన మంచు లక్ష్మి ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. అది ఎయిర్ ఇండియాను ప్రశ్నిస్తూ చేసిన పోస్ట్. ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్ చెక్ ఇన్ కౌంటర్ వద్ద రెడ్ కార్పెట్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయని.. సిబ్బందిని ప్రశ్నిస్తే నవ్వుతున్నారని మంచు లక్ష్మి పోస్ట్‌లో పేర్కొన్నారు. వీడియోను కూడా పొందుపరిచారు. పరిసరాల పరిశుభ్రత మన హక్కు అన్నారు. నిజానికి ఆ రెడ్ కార్పెట్‌లు అస్సలు బాగోలేవని.. తన ఐఫోన్ కెమెరా వాటిని బాగా చూపించిందని పేర్కొన్నారు.
మంచు లక్ష్మి పోస్ట్‌కు ఎయిర్ ఇండియా కూడా స్పందించింది. తమ ముంబై ఎయిర్‌పోర్ట్ టీమ్‌కి దిశానిర్దేశం చేస్తామని పేర్కొంది. అయితే, మంచు లక్ష్మి చేసిన పోస్ట్‌కు ఎప్పటిలాగే నెటిగివ్ కామెంట్ల వర్షం కురిసింది. ముఖ్యంగా ఆమె బిజినెస్ క్లాస్ అని పేర్కొనడం, తన ఐఫోన్ కెమెరా బాగా తీసింది అని చెప్పడం కొంత మంది నెటిజనులకు నచ్చకపోగా, ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. ‘ఓహో నువ్వు బిజినెస్ క్లాసులో వెళ్తున్నావని చెబుతున్నావా’, ‘బిజినెస్ క్లాస్, ఐఫోన్‌ని ఎలివేట్ చేద్దామని అనుకున్నావు.. అర్థమైంది’ అంటూ మంచు లక్ష్మిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. ఇంచుమించుగా అన్నీ నెటిగివ్ కామెంట్లే చేశారు. దీనిపై మంచు లక్ష్మీ స్పందించింది.
ఫుల్ ఫైర్‌తో! ‘నీకేంట్రా నొప్పి.. నువ్వేమైనా నాకు ఐఫోన్ కొనిచ్చావా అంటూ’ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చెడుగుడు ఆడేశారు.ఎయిర్‌పోర్టులో కార్పెట్ బాగోలేదని.. నా ఐఫోన్‌లో తీయడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుందని నేను ఒక ట్వీట్ చేశాను. వెంటనే కామెంట్లు మొదలైపోయాయి. ప్రతి ట్వీట్‌కి మంచి, చెడు కామెంట్లు ఉంటాయి. అయితే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఓ నువ్వు బిజినెస్ క్లాస్‌లో వెళ్తున్నావేమో, ఓహ్ నీకు ఐఫోన్ ఉందేమో అని కామెంట్లు పెడుతున్నారు. నువ్వు కొనిచ్చావా నాకు? నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు.. నీకేంట్రా నొప్పి. నువ్వేదో నాకు డబ్బులిస్తున్నట్టు. నేనొక ఐఫోన్ వాడడం, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం తప్పన్నట్టు చూపిస్తున్నారు. నాకు సొంత ప్రైవేట్ విమానం కావాలి. ఏ నీకు వద్దా? నువ్వు పెద్ద కోరికలు కోరుకోవా? కలలు కనవా?’ అంటూ ఫైర్ అయ్యారు మంచు లక్ష్మి. ప్రతిదాన్నీ తప్పుగా చూస్తున్నారని.. అలా కామెంట్లు చేసేవాళ్లు ఎవ్వరూ తనకు డబ్బులేమీ ఇవ్వట్లేదని మంచు లక్ష్మి అన్నారు. మహిళలు ఏం చేసినా చెప్పకూడదు, చూడకూడదు అంటూ నిబంధనలు పెట్టడమేంటని ప్రశ్నించారు. నా జీవితంలో నేను పొందుతున్న ఈ ఆనందాలు, సంతోషాలు అన్నీ నేను సంపాదించుకున్నవే’ అని లక్ష్మి వెల్లడించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…