Actor Vishal : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ స్పందించారు. ఆయనకే అలా జరిగిందంటే తనలాంటి సామాన్యులకు భయమేస్తుందంటూ విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన లేటెస్ట్ సినిమా మార్క్ ఆంటోనీ సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్ వచ్చిన విశాల్ ని ఓ జర్నలిస్ట్.. చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రశ్నించారు. నేను ఇక్కడ ఓటు వేయలేదు. తమిళనాటులో ఓటు వేశా. ఓ కేసు విషయంలో చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. అయయితే ఆయనను అరెస్ట్ చేసే ముందు బాగా ఆలోచించాల్సింది. ఎందుకంటే చంద్రబాబు లాంటి ఓ ప్రముఖ రాజకీయ నేతకే ఇలా జరిగిందంటే నాలాంటి సామాన్యుడికి భయమేస్తోంది.
నా సినిమా ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల ఆ పరిణామాలను నేను లోతుగా పరిశీలించలేదు. ఏది ఏమైనా చివరకు న్యాయమే గెలుస్తుందనుకుంటున్నా. మేం బయట హీరోలు కావొచ్చుగానీ ఇంట్లో సామాన్యులమే’ అని విశాల్ పేర్కొన్నారు. కాగా విశాల్ రాజకీయ ప్రవేశంపై గతంలో కొన్ని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తాడని ఓ ప్రముఖ రాజకీయ పార్టీ తరఫున కుప్పంలో పోటీ చేస్తాడని పుకార్లు కూడా వచ్చాయి. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై వస్తోన్న వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు విశాల్. అయితే తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై హీరో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
తన అభిమాన రాజకీయ నాయకుడు జగనేనని… అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో మాత్రం తాను ఆవేదనకు గురవుతున్నానని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు ఏపీ సీఐడీ పోలీసులు మరింత లోతుగా ఆలోచించాల్సిందని, పక్కాగా ఆధారాలను సేకరించిన తర్వాత వెళ్లి ఉంటే బాగుండేదని అన్నారు. తాను ఈ వ్యాఖ్యలను సినీ నటుడిగా చేయడం లేదని, ఒక సామాన్య వ్యక్తిగా తన అభిప్రాయం ఇదేనని స్పష్టం చేశారు.విశాల్ నటించిన తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. మార్క్ ఆంటోని’. టైం ట్రావెల్ సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్ జే సూర్య, సునీల్, రీతూ వర్మ, అభినయ, వైజీ మహేంద్రన్, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 15న తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదలైంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…