Dasara Movie : ఇప్పటి వరకు నాని నటించిన చిత్రాలలో కాస్త డిఫరెంట్‌గా దసరా చిత్రాన్ని చెప్పవచ్చు. కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసినప్పటికీ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు నాని.ఇక ఈ సినిమా ఈ మార్చి 30 వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల అవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా దుమ్ములేపుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. గత కొద్ది రోజులుగా దేశమంతా కూడా తిరిగేస్తున్నాడు.సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని డైరెక్ట్ చేయగా..స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. పాటలు, టీజర్స్, ట్రైలర్‌తో ఈ సినిమాకి చాలా మంచి బజ్ రావడంతో పాటు మూవీకి బిజినెస్ కూడా బాగానే జరిగింది.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినిమా థియేట్రికల్ హక్కులను దిల్ రాజు భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా కన్నడలో కూడా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం భారీ మొత్తం చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ భారీ ధరకు దసరా థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు టాక్. ఓటీటీ రైట్స్ విషయంలో కూడా సినిమా రికార్డులు క్రియేట్ చేసిందని అంటున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. హిందీ స్ట్రీమింగ్ హక్కులను హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
సినిమాని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ మూవీ క్లైమాక్స్ కోసమే ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశారని టాక్..ఇక దసరా సినిమా కోసం న్యాచురల్ నాని రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం నాని ఏకంగా 20 కోట్ల రూపాయల రేంజ్‌లో పారితోషకం తీసుకున్నారని ఫిలిం నగర్‌లో చర్చ నడుస్తుంది. దసరా సినిమాతో నాని కూడా పాన్ ఇండియా స్టార్‌గా మారాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు అన్ని రాష్ట్రాల నుండి ఘన స్వాగతం లభించడం మనం చూశాం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…