ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన చాలా మంది పెరిగి పెద్దయ్యాక తమ కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కొందరు హీరో, హీరోయిన్స్ గా రాణించే ప్రయత్నం చేస్తుండగా మరి కొందరు మాత్రం సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తున్నారు. తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన పిక్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ ఒకబ్బాయి యాక్ట్ చేశారు. హీరోయిన్ త్రిష.. సినిమాలో ఆ పిల్లాడిని చిట్టెలుక అని పిలుస్తూ సందడి చేస్తూ ఉంటుంది.
త్రిష.. చిట్టెలుక అని పిలిచిన పిల్లాడి పేరే అర్మాన్. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తున్న అతడు ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో కనిపించాడు. దీంతో అతడు ఎవరా అని వెతుకులాట మొదలు పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తమిళ రీమేక్‌గా ఓ చిత్రం చేస్తుండగా, ఇందులో అర్మాన్ నటిస్తున్నట్ట తెలుస్తుంది. అతను షూట్ గ్యాప్ లో పవన్ తో ఫొటోలు తీసుకున్నట్లున్నాడు. అయితే ఇవి అర్మాన్ అకౌంట్ లో ఎక్కడా లేవు గానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారాయి. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్.. అతను చిరు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు కదా అని ముచ్చటించుకుంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు బ్యాలన్స్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి.. టైమ్ ఉన్నప్పుడు షూటింగ్ కు వచ్చి వెళ్తుంటారు. ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నారు. నటుడు దర్శకుడు తమిళ ఇండస్ట్రీకి చెందిన సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వినోదయ సితం తెలుగు రీమేక్ వెర్షన్ లోని తన భాగాన్ని పూర్తి చేశారు. సాయిధరమ్ తేజ్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటూ..పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 24 రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…