Dasara Movie : నేచురల్ స్టార్ నాని నటించిన రా చిత్రం దసరా. భారీ అంచనాల నడమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది. పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాకి మంచి మార్కులు పడ్డాయి. రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వస్తుండటంతో దసరా మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని సినీ ఎక్స్‌పర్ట్స్ ఇప్పటి నుండే లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దసరా చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.
ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ను థియేట్రికల్ రన్ ముగిసిన తరువాత స్ట్రీమ్ చేయనున్నారు. ఈ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అజయ్ దేవగన్ నటించిన భోలా విషయానికొస్తే, ఈ చిత్రం ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. సౌత్ బ్లాక్ బస్టర్ ఖైతీకి హిందీ రీమేక్ ఇది. తమిళ స్టార్ శింబు ప్రధాన పాత్రలో నటించిన పాతు తాల విషయానికొస్తే, ఈ చిత్రం ఓటీటీ హక్కులు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో కలిగి ఉంది.. ఈ చిత్రం సరైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని సమాచారం.
అలాగే, ధనంజయ ప్రధాన పాత్రలో గురుదేవ్ హొయసాల అనే కన్నడ చిత్రం హక్కులు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. థియేట్రకిల్ రన్ పూర్తైన కొద్ది రోజులకి ఈ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అయితే దసరా విషయానికి వస్తే ఈ చిత్రం భారీ వసూళ్లని రాబట్టేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలిచింది. ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తున్నాయి. మరి దసరా చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుందో చూడాలి. థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని చూడడం మిస్ చేసుకున్నవారు కనీసం ఓటీటీలో అయిన ఈ చిత్రాన్ని చూసి తీరాల్సిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…