Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత ఏప్రిల్ 14న శాకుంతలం సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తూ వస్తుంది సమంత.. వైవాహిక బంధంలో పూర్తి నిజాయితీగా ఉన్నా అది వర్కౌట్ కాలేదని.. విడాకులు తీసుకున్న కొంతకాలానికి పుష్పలో ఐటాం సాంగ్ ఆఫర్ వస్తే ఓకే చెప్పానని.. కానీ చాలా మంది.. ఇంట్లో కూర్చో చాలు అని అన్నారని పేర్కొంది..
నేనేదో నేరం చేసినట్టు ఇంట్లో దాక్కోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. అంతే కాకుండా చేయని తప్పుకు ఎందుకు నన్ను నేను హింసించుకోవాలని సమంత ప్రశ్నించింది. ఈ టైంలో ఐటెం సాంగ్స్ కరెక్ట్ కాదు అని సలహా ఇచ్చారని.. నేనేం తప్పు చేయనప్పుడు ఇంట్లో కూర్చొని ఎందుకు బాధపడాలి.. పాటలో (లిరిక్స్) సాహిత్యం నచ్చడం వల్లే అందరూ చేయకూడదని చెప్పినా పుష్ప పాట చేశానని చెప్పుకొచ్చింది సమంత. ఒక గొప్ప సినిమాలో నటిస్తున్నప్పుడు, దేశంలోని గొప్ప డ్యాన్సర్లలో ఒకడైన అల్లు అర్జున్‌తో చేస్తున్నప్పుడు భయం ఉంటుంది. అల్లు అర్జున్ డ్యాన్స్ చేసేటప్పుడు, ఇక ఎవరూ కనిపించరు. అందుకే ఎక్కువ కష్టపడ్డాను” అని సమంత అన్నారు.
నా జీవితంలోని ఓటములు, బలహీనతలు వంటివి అందరికీ చెబితే అవి ఎవరికొకరికి ఉపయోగపడతాయని భావించా. ఒకశాతం మందికి లాభం చేకూరినా చాలు అని సమంత తెలియజేశారు. ఇన్నాళ్లు తన వైవాహిక జీవితంపై నోరు మెదపని సమంత ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది. చూస్తుంటే రానున్న రోజులలో అసలు కారణం ఏంటనేది చెప్పేసేలా ఉంది. నాగ చైతన్య మాత్రం రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…