Nandamuri Kalyan Ram : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్ – ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమా చేస్తున్నారు. ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ‘బింబిసార’ తర్వాత మరో వైవిధ్యమైన సినిమాను కళ్యాణ్ రామ్ చేస్తున్నారని అంతా నమ్మారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సినిమాలో బలమైన కంటెంట్ ఉందని భరోసా ఇచ్చింది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ అన్నీ కలగలిపిన చిత్రమిదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ఆడియెన్స్ థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని బింబిసార సమయంలో చెప్పాను. దాన్ని మీరు నిజం చేశారు. అదే కోవలో డెఫనెట్‌గా డెవిల్ మంచి కథ, కథనాలతో మీ ముందుకు వస్తుంది. విజువల్స్ ఎలా ఉంటాయనేది ట్రైలర్‌లో చూశారు. నా మాట తీసుకోండి.. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది. మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త కథతో డెవిల్ సినిమా ఉంటుంది. బింబిసార 2ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి మొదలు పెడతాం. తమ్ముడు ఎన్టీఆర్ సినిమా దేవర గురించి చెప్పాలంటే.. RRR వంటి సినిమా చేసిన తర్వాత ఓ యాక్టర్‌కి, ఓ డైరెక్టర్‌కి, ప్రొడక్షన్ హౌస్‌కి గాని ఎంతో బాధ్యత ఉంటుంది. చిన్నపాటి తప్పు జరిగినా ఎవరూ ఊరుకోరు. మేం తెలిసి తప్పు చేయం. బాధ్యతగా తీసుకుని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం అని అన్నారు.
ఇక కథానాయికలు మాళవికా మోహనన్ మాట్లాడుతూ ‘‘నటీనటులకు కొన్ని సినిమాలు అప్పటి వరకు ఉన్న ఇమేజ్‌ను బ్రేక్ చేస్తాయి. అలాంటి సినిమాలు అరుదుగా దొరుకుతుంటాయి. నాకు డెవిల్ సినిమా రూపంలో అలాంటి సినిమా దొరికింది. అభిషేక్‌గారికి థాంక్స్. శ్రీకాంత్‌గారు అద్భుతంగా నెరేట్ చేశారు. హర్ష సౌండ్ అదిరిపోయింది. కళ్యాణ్ రామ్‌గారితో నేను తొలిసారి పని చేశాను. అలాగే అవకాశం ఇచ్చిన అభిషేక్ నామాగారికి థాంక్స్. సౌందర్ రాజన్‌గారు ఎంటైర్ సినిమాకు పిల్లర్‌లాగా వర్క్ చేశారు. ఆయన సహా టీమ్ సపోర్ట్‌కి థాంక్స్’’ అన్నారు. సంయుక్తా మీనన్ మాట్లాడుతూ ‘‘డెవిల్ మూవీ కోసం ఎంటైర్ టీమ్ రెండేళ్ల పాటు ఎంతో కష్టపడింది. మంచి కథ, స్క్రిప్ట్‌తో సినిమా వస్తుంది. అభిషేక్ నామాకు థాంక్స్’’ అన్నారు. అయితే సంయుక్త మాట్లాడుతున్న సమయంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ అరుస్తున్న సమయంలో కళ్యాణ్ రామ్ సీరియస్ అవుతూ కామ్ గా ఉండాలని సైగ చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…