Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Nandamuri Kalyan Ram : క‌ళ్యాణ్ రామ్‌కి కోపం తెప్పించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎలా వార్నింగ్ ఇచ్చాడో చూడండి..!

Shreyan Ch by Shreyan Ch
December 13, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Nandamuri Kalyan Ram : నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ వైవిధ్యమైన సినిమాల‌తో ప్రేక్షకుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్ – ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమా చేస్తున్నారు. ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ‘బింబిసార’ తర్వాత మరో వైవిధ్యమైన సినిమాను కళ్యాణ్ రామ్ చేస్తున్నారని అంతా నమ్మారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సినిమాలో బలమైన కంటెంట్ ఉందని భరోసా ఇచ్చింది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ అన్నీ కలగలిపిన చిత్రమిదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఈవెంట్ లో క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ఆడియెన్స్ థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని బింబిసార సమయంలో చెప్పాను. దాన్ని మీరు నిజం చేశారు. అదే కోవలో డెఫనెట్‌గా డెవిల్ మంచి కథ, కథనాలతో మీ ముందుకు వస్తుంది. విజువల్స్ ఎలా ఉంటాయనేది ట్రైలర్‌లో చూశారు. నా మాట తీసుకోండి.. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది. మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త కథతో డెవిల్ సినిమా ఉంటుంది. బింబిసార 2ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి మొదలు పెడతాం. తమ్ముడు ఎన్టీఆర్ సినిమా దేవర గురించి చెప్పాలంటే.. RRR వంటి సినిమా చేసిన తర్వాత ఓ యాక్టర్‌కి, ఓ డైరెక్టర్‌కి, ప్రొడక్షన్ హౌస్‌కి గాని ఎంతో బాధ్యత ఉంటుంది. చిన్నపాటి తప్పు జరిగినా ఎవరూ ఊరుకోరు. మేం తెలిసి తప్పు చేయం. బాధ్యతగా తీసుకుని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం అని అన్నారు.

Nandamuri Kalyan Ram warning to fans when they not listen
Nandamuri Kalyan Ram

ఇక క‌థానాయిక‌లు మాళవికా మోహనన్ మాట్లాడుతూ ‘‘నటీనటులకు కొన్ని సినిమాలు అప్పటి వరకు ఉన్న ఇమేజ్‌ను బ్రేక్ చేస్తాయి. అలాంటి సినిమాలు అరుదుగా దొరుకుతుంటాయి. నాకు డెవిల్ సినిమా రూపంలో అలాంటి సినిమా దొరికింది. అభిషేక్‌గారికి థాంక్స్. శ్రీకాంత్‌గారు అద్భుతంగా నెరేట్ చేశారు. హర్ష సౌండ్ అదిరిపోయింది. కళ్యాణ్ రామ్‌గారితో నేను తొలిసారి పని చేశాను. అలాగే అవకాశం ఇచ్చిన అభిషేక్ నామాగారికి థాంక్స్. సౌందర్ రాజన్‌గారు ఎంటైర్ సినిమాకు పిల్లర్‌లాగా వర్క్ చేశారు. ఆయన సహా టీమ్ సపోర్ట్‌కి థాంక్స్’’ అన్నారు. సంయుక్తా మీనన్ మాట్లాడుతూ ‘‘డెవిల్ మూవీ కోసం ఎంటైర్ టీమ్ రెండేళ్ల పాటు ఎంతో కష్టపడింది. మంచి కథ, స్క్రిప్ట్‌తో సినిమా వస్తుంది. అభిషేక్ నామాకు థాంక్స్’’ అన్నారు. అయితే సంయుక్త మాట్లాడుతున్న స‌మ‌యంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ అరుస్తున్న స‌మ‌యంలో క‌ళ్యాణ్ రామ్ సీరియ‌స్ అవుతూ కామ్ గా ఉండాలని సైగ చేశారు.

Tags: nandamuri kalyan ram
Previous Post

KA Paul : స‌ర్జ‌రీ అయిన తెల్లారే కేసీఆర్ న‌డ‌క‌.. కేఏ పాల్ పంచ్‌లు మాములుగా లేవు..!

Next Post

Nadendla Manohar : జ‌గ‌న్‌కి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన నాదెండ్ల‌.. అస‌లైనోడు వ‌స్తున్నాడంటూ వార్నింగ్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Itlu Maredumilli Prajaneekam : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

by Shreyan Ch
November 25, 2022

...

Read moreDetails
వార్త‌లు

Priyadarshi : బ‌లగం మూవీలో ప్రియ‌ద‌ర్శి పాత్ర‌కి మొద‌ట అనుకుంది ఆ హీరోనా..?

by Shreyan Ch
May 20, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.