Nainika : ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించిన అందాల నటి మీనా. 90ల్లో తెలుగు స్టార్ హీరోలైన చిరంజీవి, బాలయ్య లాంటి వాళ్లతో నటించింది. తమిళంలోనూ రజనీకాంత్ లాంటి వాళ్లతో సినిమాలు చేసింది.ఇప్పటికీ కూడా పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. మీనా, కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే బిజినెస్ మ్యాన్ విద్యాసాగర్ ని 2009లో పెళ్లి చేసుకుంది. వీళ్ల బంధానికి గుర్తుగా 2012లో నైనిక పుట్టింది. వీరి జీవితం సజావుగా సాగిపోతున్న సమయంలో విద్యాసాగర్ అనారోగ్యంతో చనిపోయారు.
ఆ టైంలో మీనాపై చాలావార్తలొచ్చాయి. రెండో పెళ్లి చేసుకోబోతుందని ఎన్నో ప్రచారాలు సాగాయి. వాటన్నింటిని ఖండించింది మీనా. ఈమె నటిగా 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ ని చెన్నైలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇందులో రజనీకాంత్, రాధిక, బోనీ కపూర్, సంఘవి లాంటి చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. కానీ మీనా కూతురు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. ఆమె తన డ్యాన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. నైనిక డ్యాన్స్ చూసి మీనా చాలా ఎమోషనల్ అయింది. మిగతా సెలబ్స్ కూడా ఆమె డ్యాన్స్ పై ప్రశంసలు కురిపించారు.
ఇక నైనిక మాటలు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. అమ్మ నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నాన్న మరణించాక అంతా చీకటిగా మారింది. నువ్వు మానసికంగా ఎంత కుంగిపోయావో నాకు తెలుసు. కానీ కొన్ని మీడియా సంస్థలు నీ గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. దయచేసి అలా చేయొద్దు. ఆ అమ్మ కూడా మనిషే. ఆమెకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అంటూ నైనిక ఎమోషనల్ గా మాట్లాడింది. నైనిక మాటలకు మీనా, రజనీకాంత్ సహా అక్కడ ఉన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. నైనిక త్వరలో సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వనుందని కూడా చెబుతున్నారు. తనలానే స్టార్ హీరోయిన్‌గా కూతురిని మార్చాలని మీనా భావిస్తుందట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…