CM YS Jagan : ఏపీ రాజకీయం రోజు రోజుకి చాలా వేడెక్కుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కూడా పవన్‌ని ప్యాకేజ్ స్టార్ అని విమర్శిస్తూ సెటైర్స్ వేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు పేదల వ్యతిరేకి అన్నారు సీఎం జగన్. మూడుసార్లు సీఎం అయిన చంద్రబాబు టిడ్కో ఇళ్లు కట్టలేకపోయారని.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా మంచి చేశారా అని ప్రశ్నించారు.
ప్రజలకు మంచి చేసిన చరిత్రే బాబు దగ్గర లేదన్నారు. టిడ్కో ఇళ్ల కోసం చంద్రబాబు పేదల పేరుపై అప్పుగా రాశారని.. పేదలు నెలకు రూ. 3వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలన్నారు. చంద్రబాబు తాను చేయని పని చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పక్కన రెండు పార్టీలు లేకపోతే లేచి నిలబడలేరని.. అటు ఎమ్మెల్యే అవుతా అంటూ ప్యాకేజీ స్టార్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీరందరికీ అనుకూల మీడియా ఉంది.. వీరందరికీ అధికారం కావాలి అన్నారు. పేదలను దోచుకోవటమే వారి లక్ష్యమని.. తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నాను అన్నారు. తన వ్యాన్ ను చూసుకొని పవన్ కళ్యాణ్ మురిసిపోతున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.
రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లు దాటినా కూడ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్ధులు జనసేనకు లేరని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.చంద్రబాబు కోసం పుట్టానని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నాడు.. తన జీవితమే చంద్రబాబు కోసమే త్యాగమని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. తాను కూడ ఎమ్మెల్యే అవుతానని, దీన్ని ఎవరూ ఆపలేరని ప్యాకేజీ స్టార్ అంటున్నారని పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…