Nagarjuna : ఎప్పుడు ఎంతో సంతోషంగా సరదాగా ఉండే సమంత ఇటీవల చాలా బాధలు ఎదుర్కొంటుంది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత పడ్డ బాధలు అన్ని మనం చూశాం. ఇక తాజాగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రముఖ కథానాయిక సమంత తెలపడం చిత్రపరిశ్రమను షాక్ కు గురిచేసింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అందరూ ట్విటర్ వేదికగా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా, ఆత్మస్థైర్యాన్ని కల్పించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఎవరైన సమంత గురించి స్పందిస్తారా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో అఖిల్‌తో పాటు సుశాంత్ తమ సోషల్ మీడియా పేజ్‌లో త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఆ వ్యాధిని ఎదుర్కొని మన ముందుకు వస్తుందంటూ ట్వీట్ చేశారు.ఇక నాగార్జున కూడా స్పందించారని తెలుస్తుండగా, ఆయన సమంతకు పర్సనల్‌గా మెసేజ్ పెట్టారని ఇన్‌సైడ్ టాక్. నాగ చైతన్య ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో స్పందించలేదని టాక్.
ఇక సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. సామ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాలానుగుణంగా మన జీవితాల్లో సవాళ్లు ఎదురవుతుంటాయని, మనలోని అంతర్గత శక్తి ఏంటో తెలుసుకోడానికి ఆ సవాళ్లు ఎదురవుతాయన్నారు. సమంత ఒక అద్భుతమైన అమ్మాయని, అంతర్గతంగా ఎంతో ధైర్యంగా ఉంటుందన్నారు. సమంత అతి త్వరలోనే అనారోగ్య సమస్య నుంచి బయపడుతుందని అనుకుంటున్నానని, సమంత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.త్వరగా కోలుకోవాలి.. మీకు ఆ ధైర్యాన్ని పంపుతున్నా’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జనతా గ్యారేజ్, రామయ్య వస్తావయ్యా, బృందావనం, రభస లాంటి పలు చిత్రాల్లో సమంత జూనియర్ కు కథానాయికగా నటించింది. ఇక నాని కూడా ట్వీట్ చేస్తూ… మీరు ఎప్పటిలాగే బలంగా తిరిగి పుంజుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరు అని రాసుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…