నందమూరి కళ్యాణ్ రామ్ కొద్ది రోజులుగా మంచి సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో బింబిసార అనే చిత్రం ఆయనకు మంచి బూస్టప్ అందించింది.బింబిసారుడు అనే రాజు కథను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టైమ్ ట్రావెలింగ్ సబ్జెక్ట్‌ను చాలా ఆసక్తికరంగా చూపించాడు. థియేటర్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఓటీటీలోను అదరగొడుతుంది. చాలా తక్కువ బడ్జెట్‌లోనే భారీ విజువల్స్‌తో సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యపరచింది.
బింబిసార సినిమా చూసిన వారందరు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. సీక్వెల్ ఎప్పుడొస్తుందా? అని టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. . ఇలాంటి సమయంలో ఈ చిత్ర దర్శకుడు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. అందరూ ఊహించినట్టుగానే తొందరలోనే బింబిసార 2 వస్తుందని ప్రకటించాడు. ఇటీవల ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడిన వశిష్ట్.. బింబిసార సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టు కన్ఫార్మ్ చేశాడు. ఇప్పుడు అందరూ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పిన ఆయన.. బింబిసార సీక్వెల్‌ను ఫస్ట్ పార్ట్ ను మించేలా తీసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు.
కళ్యాణ్‌రామ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాక బింబిసార 2 మొదలవుతుందని చెప్పాడు. ప్రస్తుతం నవీన్ మేడారం దర్శకత్వంలో డేవిల్ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథలో బ్రిటిష్ గూఢచారిగా కళ్యాణ్‌రామ్ కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా పూర్తికాగానే బింబిసార రెండో పార్ట్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో బింబిసార సీక్వెల్ ను ప్లాన్ చేయడంతో, జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా నటింపజేయాలని స్వయంగా కళ్యాణ్‌రామ్ ప్లాన్ చేశాడంట. ఈమూవీలో తారక్ వారియర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…